Sensex Rally: దలాల్‌స్ట్రీట్‌లో దంచికొట్టిన బుల్స్.. సెన్సెక్స్-నిఫ్టీ దూకుడుకు 5 కారణాలివే..
Market Rally: నెల చివరి రోజుకు ఒక్కరోజు ముందు, కొత్త వారం తొలిరోజైన నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో అనూహ్యమైన ర్యాలీ కొనసాగింది. వాస్తవానికి ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీల దౌడు అస్సలు ఊహించనిది. ఈ క్రమంలో సెన్సెక్స్ దాదాపు 990 పాయింట్లు ఇంట్రాడేలో పెరగగా.. నిఫ్టీ 22,600 మార్కును అధిగమించింది.
ముందుగా నేడు బ్యాంకింగ్ రంగంలోని ఐసీఐసీఐ, ఎస్బీఐ కంపెనీల షేర్లలో నెలకొన్న ర్యాలీ మార్కెట్లను ముందుకు నడవటంలో దోహదపడింది. ఈ క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 5 శాతం పెరిగి రూ.1161 మార్కును చేరుకోగా.. ఎస్బీఐ షేర్లు సైతం 4 శాతం ర్యాలీ అయ్యాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు ప్రధానంగా నాలుగో త్రైమాసికంలో ఆరోగ్యకరమైన ఆదాయాలను నమోదు చేయటంతో ఇన్వెస్టర్లు కంపెనీల షేర్లను కొనుగోలు చేసేందుకు నేడు ఇంట్రాడేలో ఎగబడ్డారు. సెన్సెక్స్ సూచీలో ఐసీఐసీఐకి 21 శాతం, ఎస్బీఐకి 19 శాతం వెయిటేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వీటికి తోడు ఇతర ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ సంస్థల షేర్లు సైతం ర్యాలీలో పాల్గొనటం రెండవ కారణంగా నిలిచింది.

దీనికి తోడు ఇన్వెస్టర్లు గమనించాల్సిన మూడో విషయం తగ్గిన 10 సంవత్సరాల బాండ్ రాబడులు. శుక్రవారం 7.199 శాతం ఉన్న బాండ్ ఈల్డ్ సోమవారం ఇంట్రాడేలో 7.176కి తగ్గటం ఈక్విటీలను మరింత ఆకర్షనీయంగా మార్చాయి. దీంతో ఇన్వెస్టర్లు నేడు స్టాక్ మార్కెట్లలోకి తమ డబ్బును గుమ్మరించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం సంఖ్యలు అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ఎఫ్ఐఐలు స్వల్ప విక్రయాలకు పాల్పడుతున్నారు.
నేడు భారతీయ మార్కెట్లు పైపైకి ఎగబడాకటానికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల అంశాలు సైతం తోడ్పాటును అందించాయి. ప్రధానంగా యూరోపియన్ మార్కెట్లలో పెరుగుదల.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన ఈవారం ఉండటం, ఇంజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొంత చల్లారటం భారతీయ మార్కెట్లను నడిపించిన నాలుగో గ్లోబల్ అంశాలుగా ఉన్నాయి. ఇక చివరిగా టెక్నికల్స్ సైతం మార్కెట్లను ముందుకు నడవటంలో దోహదపడ్డాయి. ఈ వారం నిఫ్టీ సూచీ 22,000-22,800 స్థాయిలో, సెన్సెక్స్ సూచీ 72,500-75,000 రేంజ్‌లో ట్రేడ్ అవుతాయని ప్రభుదాస్ లిల్లాధర్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ తెలిపారు.


Click it and Unblock the Notifications