Rakesh Jhunjhunwala: 1985లో కేవలం రూ.5000 పెట్టుబడితో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఛార్టడ్ అకౌంటెంట్ రాకేష్ జున్‌జున్‌వాలా. తన తండ్రి మిత్రులతో స్టాక్ మార్కెట్ల గురించి మాట్లాడటం గురించి విని తన ప్రయాణాన్ని మెుదలు పెట్టారు.
స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ల గురించి తెలుసుకోవాలంటే ప్రతిరోజూ న్యూస్ పేపర్ చదవమని తండ్రి రాకేష్‌కు సూచించారు. అయితే పెట్టుబడి పెట్టెందుకు స్నేహితుల నుంచి అప్పులు చేయెుద్దంటూనే తాను కూడా ఎలాంటి ఆర్థిక సహకారం అందించలేదు. ఈ క్రమంలో మంచి రాబడితో డబ్బు తిరిగి చెల్లిస్తానంటూ తండ్రి క్లైంట్ నుంచి రూ.5000 అప్పు చేసి పెట్టుబడి ప్రయాణాన్ని మెుదలు పెట్టారు రాకేష్. అలా భారీ లాభాలను ఆర్జించి దలాల్ స్టీట్ బిగ్‌బుల్ గా మారారు. జూలై 2023 నాటికి రూ.38,366.4 కోట్ల పోర్ట్ ఫోలియోను కలిగి ఉన్నారు. టాటాలకు చెందిన టైటాన్ పెట్టుబడి భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

రాకేష్ జున్‌జున్‌వాలా చెప్పిన కీలక పెట్టుబడి అంశాలు..
- పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా మార్కెట్ల గురించి నేర్చుకోవాలి. మార్కెట్ పెట్టుబడి కోసం టిప్స్ పై ఆధారపడకుండా ప్యాషన్ తో ముందుకు సాగాలని సూచించారు. చదవటం ద్వారా రీసెర్చ్, ఇతర పెట్టుబడిదారులతో మాట్లాడటం వంటివి చేయాలని అన్నారు.
- స్టాక్ మార్కెట్లలో డబ్బులు సంపాదించాలంటే అన్నింటి కంటే ఎక్కువగా ఓపిక కావాలని తెలిపారు. మార్కెట్ల ఒడిదొడుకుల్లో కంగారు పడకుండా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు. రీసెర్చ్ చేయకుండా ఎమోషనల్ ట్రేడింగ్ చేస్తే నష్టపోతారని సూచించారు.
- సరైన కంపెనీని ఎంచుకుంటే దాని ధర అంతిమంగా పెరుగుతుందని నమ్ముతారు జున్‌జున్‌వాలా. ఎవరో చెప్పిన కంపెనీల వెనుక పరిగెత్తడం మానేసి.. మంచి ఫండమెంటల్స్ కలిగిన కంపెనీల్లో రీసెర్చ్ చేసిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని నొక్కి చెప్పేవారు. పెట్టుబడుల విషయంలో చాలా మంది గొర్రెల మందలా ఎవరినో అనుకరిస్తుంటారని, అది సరైన పద్ధతి కాదని అంటుండేవారు.
- సరైన ఎంపికలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అనుభవం నుంచే వస్తాయని రాకేష్ నమ్మకం. థీరిటాయికల్స్ అవసరమైనప్పటికీ అనుభవం చాలా నేర్పిస్తుందని అంటారు. మనం గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకోవటం చాలా ముఖ్యమని అనేవారు.
- పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ అవకాశాలను అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేవారు. మార్కెట్లలో ఏర్పడే అనేక ఎత్తుపల్లాలు అవకాశాలను సృష్టిస్తాయని చెప్పేవారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో మార్కెట్‌లో తక్కువ విలువ ఉన్న స్టాక్‌లను జున్‌జున్‌వాలా డిస్కౌంట్‌లో కొనుగోలు చేశారు. డబ్బును పోగొట్టుకోవడానికి భయపడితే ఎప్పటికీ డబ్బు సంపాదించలేరని అనేవారు. స్టాక్ మార్కెట్ విజయం మన పనితీరు, స్వభావాన్ని బట్టి ఉంటుందని రాకేష్ నమ్మేవారు.


Click it and Unblock the Notifications