IPO Listings: దేశంలోని ఐపీవోల మార్కెట్ గతంలో ఎన్నడూ చూడని దూకుడును కనబరుస్తోంది. ఈ క్రమంలో ఈవారం మార్కెట్లోకి నాలుగు ఐపీవోలు లిస్టింగ్ కోసం వస్తున్నాయి. 2004 నుంచి మే నెలలో జనరల్ ఎలక్షన్స్ సమయంలో ఒక్క ఐపీవో కూడా మార్కెట్లోకి అడుగుపెట్టలేదు. ఈ సమయంలో సాధారణంగా మార్కెట్లు చాలా నెమ్మదిగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అస్సలు కనిపించటం లేదు.
వివరాల్లోకి వెళితే ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లోకి లిస్టింగ్ కోసం వచ్చేస్తున్నా 4 ఐపీవోలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. రానున్న వారంలో మార్కెట్లో జాబితాకు స్టోరేజ్ టెక్నాలజీస్ ర్యాక్స్ అండ్ రోలర్స్ రాబోతోంది. దీని షేర్ల ఖరారు మే 6న ఉంటుందని తెలుస్తోంది. బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో తాత్కాలిక లిస్టింగ్ తేదీ మే 8గా ఉంది. మే 3న సబ్ స్క్రిప్షన్ ముగించిన ఐపీవో మార్కెట్ల నుంచి 38.4 లక్షల తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూతో రూ.29.95 కోట్లను సమీకరిస్తోంది. ఇందుకోసం ప్రైస్ బ్యాండ్ ధరను రూ.73-78గా ప్రకటించింది.
2. మార్కెట్లోకి ఈవారం జాబితా కోసం వస్తున్న ఐపీవో ఆమ్కే ప్రొడక్ట్స్. ఈ ఐపీవోలో షేర్ల కేటాయింపు మే 6న జరగనుందని భావిస్తున్నారు. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో తాత్కాలిక లిస్టింగ్ తేదీని మే 8, 2024గా నిర్ణయించబడింది. ఈ కంపెనీ పెట్టుబడికి ప్రైస్ బ్యాండ్ ధరను రూ.52-55గా నిర్ణయించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.12.61 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా 22.92 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది.
3. సాయి స్వామి మెటల్స్ అండ్ అల్లాయ్స్ ఐపీవో షేర్ల అలాట్మెంట్ మే 6న ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో లిస్టింగ్ మే 8న జరగొచ్చని తాత్కాలిక జాబితా తేదీ చెబుతోంది. కంపెనీ ఇష్యూ సమయంలో ఐపీవో ధరను రూ.60 వద్ద స్థిరంగా ఉంచింది. ఈ క్రమంలో 25 లక్షల తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూతో రూ.15 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
4. చివరిగా రానున్న వారం మార్కెట్లోకి వస్తున్న ఐపీవో స్లోన్ ఇన్ఫోసిస్టమ్స్. దీని షేర్ల ఖరారు ప్రక్రియ మే 8న ఉండనుందని తెలుస్తుండగా మార్కెట్లో జాబితా తేదీ మే 10గా తాత్కాలికంగా నిర్ణయించబడింది. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో మార్కెట్ల నుంచి రూ.11.06 కోట్లను సమీకరిస్తోంది. ఇందుకోసం షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.79గా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications