MF Investment: 2023 కోసం ఉత్తమ మ్యూచువల్ ఫండ్స్.. ఇన్వెస్ట్ మెంట్ కి బెస్ట్.. అస్సలు మిస్ కాకండి..!

Mutual Funds: కరోనా తర్వాత పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అమాంతం పెరిగింది. ఇందులో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఏ ఫండ్ ఎంపిక చేసుకుని డబ్బు పెట్టాలా అనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసం 4 ఉత్తమ పనితీరు ఫండ్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. ఎస్ఐపీ పద్ధతిలో ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు.

కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్..

కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్..

స్మాల్ క్యాప్ కేటగిరీలో కెనరా బ్యాంక్ రోబెకో ఫండ్ ఉత్తమ ఎంపికల్లో ఒకటిగా నిలిచింది. ఇది CRISIL ద్వారా ఈ విభాగంలో నంబర్-1 స్థానంలో ఉంది. ఫండ్ ఏడాది కాలంలో 8.33% రాబడిని అందించింది. మూడేళ్ల కాలంలో ఫండ్ 37.48% వార్షిక రాబడిని తెచ్చిపెట్టింది. ఈ ఫండ్ సిటీ యూనియన్, సెరా శానిటరీవేర్, KEI ఇండస్ట్రీస్, కెన్ ఫిన్ హోమ్స్ వంటి షేర్లలో డబ్బును ఇన్వెస్ట్ చేసింది. మెుత్తం పెట్టుబడుల్లో 95 శాతం ఈక్విటీల్లో పెట్టుబడిగా పెట్టింది. అధిక రిస్క్ తీసుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది సరిపోతుంది.

యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్..

యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్..

ఇదొక డైరెక్ట్ గ్రోత్ మ్యూచువల్ ఫండ్. మార్నింగ్‌స్టార్ దీనికి 5-స్టార్ రేటింగ్ అందించింది. ఈ ఫండ్ అధికంగా తన పెట్టుబడులను మిడ్‌క్యాప్ స్టాక్‌లలో ఇన్వెస్ట్ చేస్తోంది. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలతో పోలిస్తే ఇది కాస్త రిస్క్‌తో కూడుకున్నది. ఇందులో కేవలం రూ.500 ఎస్ఐపీ ద్వారా పెట్టుబడిని ఎవరైనా ప్రారంభించే వీలు ఉంది. ఈ ఫండ్ ఐసీఐసీఐ బ్యాంక్, చోళమండలం, ట్రెంట్, ఇండియన్ హోటల్స్ మొదలైన స్టాక్‌లలో హోల్డింగ్ కలిగి ఉంది. ఫండ్ మూడేళ్ల రాబడిని చూసినట్లయితే ఏడాది ప్రాతిపధికన 18.94 శాతంగా ఉంది. దీర్ఘకాలంలో కంపెనీ మెరుగైన రాబడులను అందించింది. SIP మార్గంలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్‌ను మెరుగ్గా నిర్వహించేందుకు వీలు ఉంటుంది.

HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్..

HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్..

హెచ్డీఎఫ్సీ అందిస్తున్న ఈ ఫండ్ కూడా CRISIL నుంచి 5-స్టార్ రేటింగ్ పొందింది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లలోని కంపెనీల్లో పెట్టుబడి పెడతాయి. నెలకు రూ.100 కనీస పెట్టుబడితో ఎవరైనా HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో SIPని ప్రారంభించవచ్చు. ఫండ్ 3 ఏళ్ల కాలంలో 19% రాబడిని అందించగా.. 5 ఏళ్ల కాలంలో 11.91% రాబడిని అందించింది. కంపెనీ ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, HDFC బ్యాంక్ మరియు NTPC వంటి పేర్లు షేర్లను హోల్డ్ చేస్తోంది.

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్..

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్..

స్మాల్ క్యాప్ కేటగిరీలో మంచి రేటింగ్స్ పొందింది క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. ఇది మార్నింగ్ స్టార్, క్రిసిల్, వ్యాల్యూ రీసెర్చ్ నుంచి మంచి రేటింగ్ కలిగి ఉంది. గత మూడేళ్లుగా ఈ ఫండ్ వార్షిక రాబడి 52 శాతంగా ఉంది. ఎస్ఐపీ రాబడి 50 శాతంగా ఉంది. ప్రస్తుతం ఫండ్ ఈ కేటగిరీలోని ఇతర ఫండ్స్ కంటే మెరుగైన రాబడిని అందిస్తోంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది చాలా మంచి ఫండ్ అని చెప్పుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+