Equity Investment: ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అందుతున్న వడ్డీ ద్రవ్యోల్బణాన్ని అధికమించటానికి కూడా సరిపోవటం లేదు. ఈ క్రమంలో ప్రజలు మరింత రాబడులను అందించే వివిధ మార్గాల వైపు చూస్తున్నారు. అధిక రాబడిని ఇచ్చే 4 స్టాక్ మార్కెట్ ఆధారిత పెట్టుబడి అవకాశాలను చూద్దాం..
ముందుగా ఎక్కువ మంది చూపు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన అనేక కంపెనీల షేర్లపైనే ఉంటుంది. స్టాక్ ట్రేడింగ్ ద్వారా లేదా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టాలన్నా ముందుగా కావాల్సింది ఒక డీమ్యాట్ ఖాతా. దీనిద్వారా నేరుగా షేర్లను కొనుగోలు చేసి రాబడులను పొందవచ్చు. ఇదే సమయంలో రాబడులతో పాటు రిస్క్ కూడా ఉంటుందని ఇన్వెస్టర్లు గమనించాలి. మార్కెట్ నిపుణులు సూచనల ప్రకారం మంచి కంపెనీల్లో దీర్ఘకాలం పెట్టుబడులు ఉత్తమమని సూచిస్తుంటారు. ఇవి బ్యాంక్ చెల్లించే వడ్డీ కంటే అధిక రాబడులను అందిస్తాయి.

రెండవ మార్గంగా ఈక్విటీల నుంచి మంచి రాబడులను పొందేందుకు ఐపీవోల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. మంచి కంపెనీల ఐపీవోలు లాంచ్ సమయంలోనే షేర్ల కొనుగోలులో పాల్గొనటం ఉత్తమ రాబడులను అందిస్తుంది. షేర్ల అలాట్మెంట్ సమయంలో పొందినట్లయితే లిస్టింగ్ రోజున బాగా సంపాదించొచ్చు. ఒకవేళ షేర్లను ఐపీవోలో పొందకపోతే సెకండరీ మార్కెట్లో కొనుగోలు అవకాశాలను పరిశీలించొచ్చు. 2023లో వచ్చిన మెుత్తం ఐపీవోల్లో 90 శాతానికి పైగా బంపర్ లాభాలను అందించి ఇన్వెస్టర్లను సంపన్నులుగా మార్చేశాయి. రోజులు, గంటల వ్యవధిలోనే అనేకమార్లు సంపద రెప్పింపు అయిన సంగతి మనం చూశాం.
ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు మ్యూచువల్ ఫండ్లను సైతం పరిశీలించొచ్చు. ప్రధానంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటరిగీలోని చాలా కంపెనీలు గత కొన్ని నెలలుగా భారీ రాబడులను అందిస్తున్నాయి. పైగా మ్యూచువల్ ఫండ్స్ పెద్ద నష్టాల నుంచి కొత్త ఇన్వెస్టర్లను కాపాడతాయి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు అత్యంత తక్కువ రిస్క్ కలిగి ఉండటం దేశంలో అనేక మంది పెట్టుబడిదారులను పెట్టుబడిపెట్టేలా ప్రేరేపిస్తున్నాయి.
ఇక చివరగా ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు(ELSS) ఇన్వెస్టర్లు మంచి రాబడులను పొందేందుకు వీలు కల్పిస్తాయి. ఈ ఆస్తుల్లో 80 శాతం ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధిత ప్రాజెక్టుల్లో పెట్టుబడి కలిగి ఉంటాయి. ELSSలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులను పెట్టుబడిదారులకు అందిస్తాయి. ELSSలో పెట్టుబడి పెట్టే మొత్తం మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి తీసివేయబడుతుంది. ఇది ఆదాయపు పన్ను మొత్తాన్ని తగ్గిస్తుంది. పైగా వీటికి మూడేళ్ల లాక్ ఇన్ పిరియడ్ ఉంటుంది.


Click it and Unblock the Notifications