Stocks to BUY: గడచిన వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల వేళ భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత తిరిగి వేగంగా పుంజుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రానున్న వారంలో కొనుగోలుకు అనువైన షేర్లను ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీకి చెందిన నిపుణులు ప్రస్తుతం సూచిస్తున్నారు.
వరుసగా మూడవ సెషన్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 శుక్రవారం సరికొత్త గరిష్ఠాల వద్ద ట్రేడింగ్ ముగించాయి. ఎన్నికల ఫలితాల అనంతరం మార్కెట్లు పుంజుకోవటంతో జూన్ మాసంలో ఇప్పటివరకు సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పడుతుందన్న విశ్వాసం మార్కెట్‌లో కొనసాగుతోంది. సుస్థిర ప్రభుత్వంపై ఆశతో మార్కెట్ మూడ్ బుల్లిష్ జోన్‌కు తిరిగి వచ్చింది. ఈ క్రమంలో గత వారంలో 52 గరిష్ఠ స్థాయి 30+ చూసిన తర్వాత ఇండియా విక్స్ సూచీ ప్రస్తుతం 20 మార్కు దిగువకు చేరుకుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మార్కెట్‌లో తక్కువ అస్థిరత కనిపించవచ్చచిని తాము భావిస్తున్నట్లు ఆనంద్ రాఠీలోని సీనియర్ మేనేజర్ రీసెర్చ్ గణేష్ డోంగ్రే అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆయన సోమవారం కోసం కొనుగోలుకు మూడు షేర్లను వెల్లడించారు.
1] బ్యాంక్ ఆఫ్ బరోడా: బ్రోకరేజ్ ముందుగా ప్రభుత్వ యాజమాన్యంలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన బీవోబీ షేర్లను రూ.270 రేటు వద్ద కొనుగోలు చేసేందుకు అనువైన ధరగా సూచించింది. స్టాక్ ప్రధాన మద్దతు ధర రూ.263గా ఉన్నందున ప్రస్తుత దశలో స్టాక్ మళ్లీ రూ.270 ధర స్థాయి వద్ద రివర్సల్ ప్రైస్ యాక్షన్ ఫార్మేషన్‌ను చూసింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.283 వద్దకు చేరుకునే అవకాశం ఉందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. ఇదే క్రమంలో ఇన్వెస్టర్లు రూ.263ను స్టాప్ లాస్ ధరగా ఉంచుకోవాలని సూచించింది.
2] సర్వోటెక్: రూ.84 వద్ద కొనండి | టార్గెట్ ధర: రూ.90 | స్టాప్ లాస్:రూ.78
స్వల్పకాలిక ట్రెండ్‌లో స్టాక్ బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్‌ను చూసింది. సాంకేతికంగా రిట్రెంచ్‌మెంట్ 90 వరకు సాధ్యమవుతుంది కాబట్టి, మద్దతు స్థాయి 78ని కలిగి ఉంటే ఈ స్టాక్ స్వల్పకాలిక స్థాయి 90కి బౌన్స్ అవుతుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. దీనిని పరిగణలోకి తీసుకుని ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నట్లైతే షేర్లకు స్టాప్ లాస్ ధరను రూ.78గా ఉంచుకోవాలని సూచించబడింది.
3] HCL టెక్: రూ.1430 వద్ద కొనండి | టార్గెట్ ధర: రూ.1485 | స్టాప్ లాస్: రూ.1390
బ్రోకరేజ్ స్టాక్‌లో దాదాపు రూ.1390 ప్రధాన మద్దతును చూసింది. కాబట్టి, ప్రస్తుత దశలో స్టాక్ మళ్లీ రూ.1430 ధర స్థాయి వద్ద రివర్సల్ ప్రైస్ యాక్షన్ ఫార్మేషన్‌ను చూసింది. ఇది దాని తదుపరి ప్రతిఘటన స్థాయి వరకు ర్యాలీని కొనసాగించవచ్చు. రానున్న వారంలో ఐటీ సేవల కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.1485గా పరిగణించాలని బ్రోకరేజ్ సూచిస్తుండగా.. ఇందుకోసం స్టాప్ లాస్ ధరను రూ.1390గా ఆనంద్ రాఠీ నిపుణులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications