Stocks To Buy: రానున్న వారంలో చాలా మంది దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఏ స్టాక్స్ కొంటే మంచి రాబడులను పొందొచ్చనే దానిపై కొంత సందిగ్ధంలో ఉన్నారు. ఈ క్రమంలో నిపుణులు సూచిస్తున్న 3 కంపెనీల షేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఛాయిస్ బ్రోకింగ్‌కు చెందిన సుమీత్ బగాడియా సోమవారం ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు మూడు షేర్లను సూచిస్తున్నారు. మార్కెట్ల పనితీరుతో పాటు ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత వీటిని సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన విశ్లేషణ ప్రకారం.. టైటాన్, డీఎల్ఎఫ్, ఏబీ క్యాపిటల్ కొనుగోలుకు సిఫార్సు చేస్తున్నారు. అసలు ఈ కంపెనీల షేర్లను ఎందుకు ఎంచుకున్నారు, టార్గెట్ ధర ఎంత వంటి టెక్నికల్ అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

ముందుగా టైటాన్ షేర్లను పరిశీలిస్తే ఇది దివంగత స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాకు చాలా ఇష్టమైన కంపెనీ. దీనిలో ఆయన భారీగా సంపదను కూడబెట్టుకున్నారు. రానున్న సోమవారం ఈ షేర్లను రూ.3,310 రేటు వద్ద కొనుగోలు చేయెుచ్చని సుమీత్ తెలిపారు. అయితే దీనికోసం ఇన్వెస్టర్లు రూ.3,500 టార్గెట్ ధరగా పెట్టుకోవాలని స్పష్టం చేస్తూ.. రూ.3,140 స్టాప్‌లాస్‌గా పరిగణించాలన్నారు. గడచిన ఐదు రోజులుగా కంపెనీ షేర్లు కన్సాలిడేటెడ్ స్టేజ్‌లో ఉందని బ్రేకౌట్ ఉండొచ్చని వెల్లడించారు. ఇదే జరిగితే స్టాక్ తన కొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకుంటుందని అంచనా వేశారు. టెక్నికల్స్ కూడా దీనికి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో డీఎస్ఎఫ్ షేర్లను రూ.548 రేటు వద్ద కొనుగోలు చేయెుచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు రూ.581ని టార్గెట్ ధరగా ఉంచుకోవాలని.. అలాగే రూ.530ని స్టాప్‌లాస్ కింద పరిగణించాలని వెల్లడించారు. ఇక్కడ టెక్నికల్స్ పరిశీలిస్తే 200 ఎక్స్ పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా దాటింది. ఆర్ఎస్ఐ వంటి ఇతర టెక్నికల్స్ కూడా సానుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. దీనికి ప్రస్తుత బులిష్ సెంటిమెంట్లు సైతం అనుకూలంగా ఉన్నట్లు సుమీత్ అన్నారు.
చివరిగా ఇన్వెస్టర్లు కొనుగోలుకు పరిశీలించదగిన స్టాక్ ఆదిత్య బిర్లా క్యాపిటల్. ఈ షేర్లను రూ.185.50 రేటు వద్ద కొనుగోలు చేయెుచ్చని వెల్లడించారు. దీనికి టార్గెట్ ధరగా రూ.196ను సూచిస్తూనే పెట్టుబడిదారులు రూ.173ను స్టాప్ లాస్ రేటుగా పెట్టుకోవాలని బ్రోకరేజ్ నిపుణుడు తెలిపారు. దీనికి ప్రస్తుతం సానుకూలమైన టెక్నికల్స్ తాను గుర్తించినట్లు పేర్కొన్నారు.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలను తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి కాబట్టి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించి పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవటం ఉత్తమం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications