Multibagger Stocks: ఇటీవలి కాలంలో పెట్టుబడిదారులు మంచి పెన్నీ స్టాక్స్ వేటలో పెద్దపెద్ద ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలను నిరంతరం వాచ్ చేస్తున్నారు. మార్కెట్ల బూమ్ సమయంలో చాలా పెన్నీ స్టాక్స్ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తూ తమ పనితీరుతో సత్తా చాటుకుంటున్నాయి. అందుకే గడచిన కొన్నేళ్లుగా మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్ విషయంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉంటున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో దేశీయ అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ పెట్టుబడుల పోర్ట్ ఫోలియోపై ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఎల్ఐసీ దాదాపు 330 కంపెనీల్లో 1 శాతం వాటాను కలిగి ఉంది. ఈ క్రమంలో బీమా దిగ్గజం 14.72 ట్రిలియన్ రూపాయలు పెట్టుబడుల విలువను కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ల కరెక్షన్ కొనసాగుతున్న వేళ ఫిబ్రవరి 2025లో దీని విలువ రూ.13.87 ట్రిలియన్లకు తగ్గింది. ఈ క్రమంలో మల్టీబ్యాగర్ రాబడులను అందించిన మూడు పెన్నీ స్టాక్స్ పై రిటైల్ ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోంది.

వాస్తవానికి పెన్నీ స్టాక్స్ అనేవి తక్కువ ధర వద్ద భవిష్యత్తులో మంచి పెరుగుదలకు అవకాశం ఉన్నవిగా చెప్పుకోవచ్చు. కంపెనీలో వ్యాపారం మంచి భవిష్యత్తును కలిగి ఉండి.. ప్రస్తుతం తక్కువ ధర వద్ద అందుబాటులో మార్కెట్లో చాలా మంది గుర్తించని కంపెనీలను మల్టీబ్యాగర్ స్టాక్స్ అని పిలుస్తారు. తక్కువ కాలంలో ఎక్కువ రాబడిని అందించటం వల్ల ఇవి ఎక్కువగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. LIC వంటి ప్రముఖ సంస్థాగత పెట్టుబడిదారులు కూడా తమ పోర్ట్‌ఫోలియోలో కొన్ని పెన్నీ స్టాక్‌లను హోస్ట్ చేస్తున్నాయి. ఇవి దీర్ఘకాలంలో లక్ష పెట్టుబడిని ఏకంగా రూ.15 లక్షలుగా మార్చేశాయి. ఎల్ఐసీకి భారీ రాబడిని అందించిన మూడు పెన్నీ స్టాక్స్ ఇవే..
- ఎల్ఐసీ హోల్డ్ చేస్తూ మంచి రాబడిని అందించిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్ కేటగిరీలో ముందు వరుసలో ATV ప్రాజెక్ట్స్ ఇండియా కంపెనీ షేర్లు నిలిచారు. 5 ఏళ్ల కాలంలో ఎల్ఐసీకి 778 శాతం భారీ రాబడిని ఈ స్టాక్ అందించింది. గడచిన ఏడాది కాలంలో స్టాక్ ధర 65 శాతం మేర పెరుగుదలను చూసింది. వాస్తవానికి కంపెనీ చక్కెర పరిశ్రమకు అవసరమైన పరికరాల తయారీలో ఉంది. కంపెనీ ఉత్పత్తులు ప్రధానంగా రసాయనాల తయారీ, పెట్రోకెమికల్స్, ఎరువులు, విద్యుత్ వంటి పరిశ్రమల్లో ఉపయోగిస్తుంటారు.
- ఇక ఎల్ఐసీకి మంచి రాబడులను తెచ్చిపెట్టిన రెండవ పెన్నీ స్టాక్ గా ఓరియంట్ గ్రీన్ పవర్ నిలిచింది. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి చెందిన కంపెనీ తన పెట్టుబడిదారులకు దీర్ఘకాలంలో మంచి రాబడులను తెచ్చిపెట్టింది. గడచిన 5 ఏళ్ల కాలంలో 645 శాతం మేర భారీ రాబడిని ఈ స్టాక్ ఎల్ఐసీకి అందించి తన సత్తా చాటుకుంది. గత ఏడాది కాలంలో 45 శాతం మేర పెరుగుదలతో ఉత్తమ పనితీరును కనబరిచింది. కంపెనీ ఇండిపెండెంట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిదారు. ఇది విభిన్న రకాల పవన విద్యుత్ ప్లాంట్ల అభివృద్ధి, యాజమాన్యం, నిర్వహణలో నిమగ్నమై ఉంది.
- ఇక చివరిగా ఎల్ఐసీకి సూపర్ రాబడిని అందించిన పెన్నీ స్టాక్స్ కేటగిరీలో హిందూస్తాన్ మోటార్స్ కంపెనీ షేర్లు ఉన్నాయి. కలకత్తా కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఆటోమోటివ్ కంపెనీ 5 ఏళ్ల కాలంలో 415 శాతం మేర రాబడిని తెచ్చిపెట్టింది. అలాగే గడచిన ఏడాది కాలంలో స్టాక్ 25 శాతం రాబడిని అందించింది. కంపెనీ వాహనాలు, వాహన విడిభాగాలు, ఉక్కు ఉత్పత్తులు, విడిభాగాలను ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది. అలాగే కంపెనీ వాహన విడిభాగాల వ్యాపారంలోనూ ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications