Iran - Israel Attack: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ విన్నా ఇజ్రాయెల్-ఇరాన్ దాడి గురించే చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇది ముదిరి యుద్ధ దిశగా దారితీస్తుందా అనే అనుమానాలు భయాలను పెంచుతున్నాయి. ఈ పరిస్థితులు పరోక్షంగా భారత స్టాక్ మార్కెట్లను సైతం నష్టాల్లోకి నెట్టిన సంగతి తెలిసిందే.
దీంతో కొత్త వారం మెుదటి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే కొన్ని నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.6 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. ఇరాన్-ఇజ్రాయెల్ దాడి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచటంతో పాటు ప్రపంచ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టేసింది. దీంతో గతకొంత కాలంగా కొనసాగుతున్న భారత స్టాక్ మార్కెట్ల ర్యాలీకి బ్రేక్ పడింది. ప్రస్తుతం మార్కెట్లు భారీ కరెక్షన్ చూస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల చూపు ఇజ్రాయెల్‌తో ముడిపడి ఉన్న భారతీయ కంపెనీలపై పడింది. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం వల్ల ప్రభావితమయ్యే 14 భారతీయ కంపెనీలను పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్నారు. కొన్ని ప్రముఖ కంపెనీల్లో అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, లుపిన్‌తో పాటు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి IT కంపెనీలు కూడా ఉన్నాయి. అదానీ పోర్ట్స్ ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌ను కలిగి ఉండగా.. టారో ఫార్మాలో మెజారిటీ వాటాను సన్ ఫార్మా కలిగి ఉంది. అదేవిధంగా ఎన్‌ఎంటీసీ, కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్, విప్రో, టెక్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లార్సెన్ అండ్ టూబ్రో కూడా ఇజ్రాయెల్‌లో పెట్టుబడులు కలిగి ఉన్నాయి.
నేడు ప్రభావితమైన 14 కంపెనీల జాబితాలో షేర్లు కలిగి ఉన్న వ్యక్తులు మార్కెట్ పరిస్థితిని విశ్లేషించి.. దీర్ఘకాల కోణంలో బై ఆన్ డిప్స్ ఆధారంగా కొనుగోలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే షేర్లు ఇంకా పతనమవుతాయనే భయం ఉన్న వారు వేచి ఉండే ధోరణిని కాదనుకున్నట్లయితే సరైన సమయంలో స్టాక్స్ విక్రయించవచ్చని వారు చెబుతున్నారు. అలాగే స్టాక్ మార్కెట్లు ఇప్పటికే గరిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
భారతదేశ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్- నిఫ్టీ గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలను తాకినప్పటికీ.. తాజాగా క్షీణించిన భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఐటీ, ఎక్స్‌పోర్ట్స్, ఫార్మా, బ్యాంకింగ్ సహా మరిన్ని రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలను 50-100 డాలర్లు పెంచవచ్చు. అదేవిధంగా ముడి చమురు ధరలు 90 డాలర్ల స్థాయి నుంచి 93-95 డాలర్లకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications