Bullish Stocks: మోదీ తిరిగి రాకతో పెరిగే 14 స్టాక్స్ ఇవే.. మీరూ ఇన్వెస్ట్ చేశారా..??
బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన తరుణంలో మార్కెట్లపై భారీగా ఊహాగానాలు పెరిగిపోయాయి. ఈరోజు సెన్సెక్స్ నిఫ్టీలు తమ కొత్త గరిష్ఠాలకు చేరుకోవటం దీనినే ప్రతిబింబిస్తోంది.
2024లో మళ్లీ కేంద్రంలో ప్రధానిగా మూడోసారి మోదీ అవుతారని.. కేంద్రంలో బీజేపీ సర్కార్ తిరిగి వస్తుందని మార్కెట్లు బలంగా నమ్ముతున్నాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లకు పైగా ర్యాలీని నమోదు చేసింది. స్టాక్ మార్కెట్ ముందస్తు ఎన్నికల మోడ్‌లోకి వచ్చిందని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందు స్టాక్ మార్కెట్లో 10 శాతం నుంచి 35 శాతం పెరుగుదల కనిపించిందని గత చరిత్ర చెబుతోంది. 1999 లోక్‌సభ ఎన్నికల నుంచి మార్కెట్‌లో ఈ ట్రెండ్ నిరంతరం కనిపిస్తోంది.

అయితే నిపుణుల తాజా అంచనాల ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా, హీరో మోటార్స్, ఎల్ టి, అల్ట్రాటెక్ సిమెంట్స్, గోద్రేజ్, సన్ టెక్, టైటాన్, ఐహెచ్సీఎల్, లెమన్ ట్రీ హోటల్స్, పీఎన్బీ హౌసింగ్, మెదాంతా, ఏంజెల్ వన్ కంపెనీల షేర్లు భారీగా లాభపడవచ్చని వెల్లడైంది.
మోడీ మళ్లీ రానున్న ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తారనే ఆలోచనల మధ్య నేడు మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు పుంజుకుంటున్నాయి. అదానీకి చెందిన మొత్తం 10 స్టాక్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇవి పెట్టుబడిదారులను ధనవంతులుగా చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications