Stocks In Focus: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లను కలవరానికి గురిచేస్తున్న ఏకైక అంశం ఇజ్రాయెల్ యుద్ధం. దీని ప్రభావం చాలా దేశాలపై పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే తాజా యుద్ధం ఉక్రెయిన్-రష్యా దాని కంటే చిన్నదేనని. ఈక్విటీ మార్కెట్లపై భారీ ప్రభావం ఉండకపోవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భారతదేశానికి చెందిన కొన్ని కంపెనీలను ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ రాజకీయ పరిస్థితులు మారిన వేళ పెట్టుబడిదారులు ఈ కంపెనీలపై అప్రమత్తతను ప్రదర్శిస్తున్నారు. ఇదే క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు సైతం పెరుగుతున్నాయి.

భారత్‌కు సంబంధించి అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, ఎన్ఎమ్డీసీ, కళ్యాణ్ జ్యూవెలర్స్, టైటాన్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, ఎల్&టి కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి పడింది. ఎందుకంటే ఈ కంపెనీలు ఇజ్రాయెల్‌లో వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి కాబట్టి. ఇటీవల జీ20 సదస్సు వేదికగా నిర్ణయించిన.. భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్‌ను నిర్మించాలనే భారతదేశ ప్రణాళికపై తాజా పరిస్థితులు ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా పరిణామాల కారణంగా పెరుగుతున్న చమురు ధరలతో వివాదం ఆయిల్ కంపెనీలు, రైల్వే స్టాక్స్, షిప్పింగ్ కంపెనీలపై ప్రభావం చూపుతోంది. అలాగే బాండ్స్ అండ్ ఈక్విటీ మార్కెట్లు తాత్కాలికంగా ఓలటాలిటీకి గురవుతున్నాయి. దీనికి తోడు క్యాపిటల్ మార్కెట్, బ్యాంకింగ్ రంగం, ద్రవ్య లోటుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పరిస్థితులను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. హటాత్తుగా ఏర్పడిన ఈ పరిణామాలు దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులు ఆందోళనకు స్పష్టమైన సంకేతాలను చూపుతోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications