Mutual Funds: ఈక్విటీ మార్కెట్లోని ఒడిదొడులను తట్టుకోలేమనుకునే అనేకమంది ఎంచుకునే మార్గం మ్యూచువల్ ఫండ్స్. గత కొంత కాలంగా ఇవి మార్కెట్ బెంచ్ మార్క్ సూచీల కంటే మెరుగైన రాబడిని అందిస్తున్నాయి. ఏడాది కాలంలో 46 శాతం రాబడిని అందించిన ఫండ్‌తో పాటు మంచి రాబడిని అందించిన 11 మ్యూచువల్ ఫండ్స్ వివరాలు తెలుసుకుందాం..
* క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్: ఈ ఫండ్ గడచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు అత్యధికంగా 46.04% రాబడిని ఇచ్చింది.

* నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్: ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తన పట్టుబడిదారులకు ఏడాది కాలంలో అత్యధికంగా 45.04% రాబడిని ఇచ్చింది.
* HDFC మిడ్ క్యాప్ ఫండ్: ఈ ఫండ్ పెట్టుబడిదారులకు 40.65% రాబడిని ఇచ్చింది. గడచిన ఏడాది కాలంలో ఈ అద్భుతమైన రాబడిని అందించింది.
* ఎడెల్‌వీస్ స్మాల్ క్యాప్ ఫండ్: గత ఏడాది కాలంగా ఎడెల్‌వీస్ స్మాల్ క్యాప్ ఫండ్ తన పెట్టుబడిదారులకు 38.25% రాబడిని అందించింది.
* SBI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్: గడచిన ఏడాది కాలంలో ఈ ఫండ్ తన పెట్టుబడిదారులకు ఏకంగా 36.90% రాబడిని ఇచ్చింది.
* ICICI ప్రుడెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్: ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ తన పెట్టుబడిదారులకు గత ఏడాదిలో ఈక్విటీ పెట్టుబడులపై 36.16% రాబడిని ఇచ్చింది.
* నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్: ఈ నిప్పాన్ ఫండ్ తన ఇన్వెస్టర్లకు ఏడాది కాలంలో ఏకంగా 36.12% రాబడిని అందించింది.
* JM ఫ్లెక్సీ క్యాప్ ఫండ్: ఫ్లెక్సీ క్యాటగిరీకి చెందిన ఈ మ్యూచువల్ ఫండ్ గత ఏడాది కాలంలో 35.95% రాబడిని ఇచ్చింది.
* ICICI ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్: ఈ స్మాల్ క్యాప్ ఫండ్ దాని పెట్టుబడిదారులకు ఏడాదిలో 34.08% రాబడిని ఇచ్చింది.
* ICICI ప్రుడెన్షియల్ భారత్ 22 ఫండ్: గత ఏడాది కాలంలో ఫండ్ తన పెట్టుబడిదారులకు 35.59% రాబడిని ఇచ్చింది.
* టాటా స్మాల్ క్యాప్ ఫండ్: ఈ స్మాల్ క్యాప్ ఫండ్ గత 1 సంవత్సరంలో తన పెట్టుబడిదారులకు 36.66% రాబడిని ఇచ్చింది.


Click it and Unblock the Notifications