IPO News: కొత్తవారం 10 ఐపీవోలు ప్రారంభం.. బెట్టింగ్ కోసం డబ్బు రెడీ చేస్కోండి ట్రేడర్స్..
Upcoming IPOs: ఒకప్పుడు నెలకో రెండు నెలలకో ఒక ఐపీవో మార్కెట్లోకి వచ్చేవి. కానీ ఇప్పుడు రోజుకు ఒకటి లేదా రెండు మార్కెట్లోకి క్యూ కడుతున్నాయి. దీంతో దలాల్ స్ట్రీట్ అతిపెద్ద ఐపీవోల రద్దీని చూస్తోంది. ఈ క్రమంలో మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ సైతం ఇన్వెస్టర్లకు ఎస్ఎమ్ఈ ఐపీవోలతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలోనే ఈవారం దాదాపు 10 కంపెనీలు తమ ఐపీవోలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.
1. WOL3D IPO:
కంపెనీ తాజా ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.25.56 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ ఇష్యూ ద్వారా 14.52 లక్షల తాజా షేర్లను జారీ చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి కోసం సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు తెరచి ఉండనుంది. ఇందుకోసం ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.142 నుంచి రూ.150గా నిర్ణయించింది. అలాగే గ్రేమార్కెట్ ప్రీమియం రూ.65గా కొనసాగుతోంది.

2. Manba Finance IPO:
మెయిన్ బోర్డ్ కేటగిరీ కింద వస్తున్న ఐపీవో సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 25 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ క్రమంలో ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.114 నుంచి రూ.120గా నిర్ణయించబడింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.150.84 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రస్తుతం షేరుకు గ్రేమార్కెట్లో రూ.60 ప్రీమియం పలుకుతోంది.
3. Rappid Valves IPO:
ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.30.41 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 25 వరకు తెరిచి ఉంటుంది. అలాగే షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.210-222గా ఉంచింది. ఇదే క్రమంలో లాట్ పరిమాణాన్ని 600 షేర్లుగా నిర్ణయించింది.
4. Unilex Colours and Chemicals IPO:
ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో సెప్టెంబర్ 25 నుంచి సెప్టెంబర్ 27 వరకు తెరిచి ఉంటుంది. ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.82 నుంచి రూ.87గా కంపెనీ నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా ఉంచింది. కంపెనీ మార్కెట్ల నుంచి రూ.31.32 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
5. Thinking Hats Entertainment Solutions IPO:
కంపెనీ తాజా ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.15.09 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఇన్వెస్టర్ల ముందుకు వస్తోంది. ఐపీవోలో కంపెనీ అమ్మకానికి పూర్తిగా తాజా ఇష్యూ షేర్లను విక్రయిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు సెప్టెంబర్ 25 నుంచి సెప్టెంబర్ 27 వరకు అవకాశం ఉంది. ఈక్రమంలో కంపెనీ ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.42-44గా నిర్ణయించింది.
6. TechEra Engineering IPO:
ఐపీవో పెట్టుబడిదారుల కోసం సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది. పెట్టుబడిదారులు బెట్టింగ్ వేసేందుకు సెప్టెంబర్ 27 వరకు అవకాశం ఉంది. ఈ క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని రూ.75-82గా ఉంచింది. ప్రస్తుతం గ్రేమార్కెట్లో స్టాక్ రూ.10 ప్రీమియం పలుకుతోంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ.35.90 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

7. KRN Heat Exchanger IPO:
మెయిన్ కేటగిరీలో వస్తున్న కంపెనీ ఐపీవో పరిమాణం రూ.341.95 కోట్లు సమీకరించనుంది. ఐపీవో పూర్తిగా తాజా ఇష్యూపై ఆధారపడి ఉంది. పెట్టుబడిదారులకు విక్రయించటం కోసం కంపెనీ తన షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.209-223గా నిర్ణయించింది. నేడు గ్రేమార్కెట్లో ఒక్కో షేరుకు రూ.223 ప్రీమియం పలుకుతోంది.
8. Divyadhan Recycling Industries IPO:
ఐపీవో సెప్టెంబర్ 26 నుంచి సెప్టెంబర్ 30 వరకు తెరిచి ఉంటుంది. ఐపీవో కోసం కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.60 నుంచి రూ.64గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా ఉంచింది. 2010లో స్థాపించబడిన కంపెనీ మార్కెట్ల నుంచి రూ.24.17 కోట్లను సమీకరిస్తోంది.
9. Forge Auto International IPO:
కంపెనీ ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.31.10 కోట్లను సమీకరిస్తోంది. ఐపీవో ద్వారా కంపెనీ 28.80 లక్షల తాజా షేర్లను జారీ చేయనుంది. ఐపీవో సెప్టెంబర్ 26న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.102 నుంచి రూ.108కి నిర్ణయించింది.
10. Sahasra Electronics Solutions IPO:
ఎస్ఎమ్ఈ కేటగిరీలో మార్కెట్లోకి వస్తున్న ఐపీవో పెట్టుబడిదారుల నుంచి రూ.186.16 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.269 నుంచి రూ.283గా కంపెనీ ఉంచింది. అలాగే లాట్ పరిమాణాన్ని 400 షేర్లుగా నిర్ణయించింది.


Click it and Unblock the Notifications