పెళ్లి అంటే పెద్ద వాళ్ళు చూసే మ్యాచ్లు, జాతకాలు, ఫోటోలు పంపించుకోవడం... ఇదే మనకు తెలిసిన సంప్రదాయం కదా? కానీ కొన్ని మ్యాట్రిమోనియల్ యాప్స్ వచ్చినా కూడా అవి బోరింగ్! అని అనుకునే వారికి ఇప్పుడు షాక్ ఎదురవబోతోంది. నాట్ డేటింగ్ అనే కొత్త యాప్ పెళ్లి పరిచయాల ప్రపంచంలో గేమ్‌నే మార్చేస్తోంది. ఎలైట్ స్టాండర్డ్స్, సీరియస్ అప్రోచ్, AI టచ్‌తో ఈ యాప్ ఇప్పుడు యువ సింగిల్స్‌లో వైరల్‌గా మారింది.
ఇండియాలో మ్యాట్రిమోనియల్ యాప్‌ల రంగంలో కొత్త చర్చకు దారితీస్తున్న "నాట్ డేటింగ్". ఈ యాప్ వెనుక ఉన్నవారు జస్వీర్ సింగ్ మరియు అభిషేక్ అస్తానా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే ఈ యాప్ ప్రత్యేకమైన విధానం, కఠినమైన నిబంధనలు, ప్రీమియం ఫీచర్ల వల్ల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

నాట్ డేటింగ్‌లో చేరాలంటే పురుషులకు ఏటా కనీసం రూ. 50 లక్షల ఆదాయం ఉండాలి. ఇది సాధారణ యాప్‌లతో పోలిస్తే చాలా భిన్నం. మహిళల కోసం మాత్రం ఎలాంటి ఆదాయ పరిమితి పెట్టలేదు. దీంతో యాప్‌కి ఒక "ఎలైట్" ఇమేజ్ వచ్చింది. ఈ యాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా నడుస్తున్నప్పటికీ, లాంచ్ చేసిన ఆరు నెలల్లోపే లాభదాయకంగా ఆపరేషనల్ ప్రాఫిట్ మారడం గమనార్హం. చాలా స్టార్టప్‌లు కస్టమర్లను ఆకర్షించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, నాట్ డేటింగ్ మాత్రం మార్కెట్‌లో గ్యాప్‌ను సరిగ్గా గుర్తించి, సరైన ప్రొడక్ట్‌ను అందించి, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా సహజంగా యూజర్లను సంపాదించింది.
నాట్ డేటింగ్ CEO జస్వీర్ సింగ్ మాట్లాడుతూ, భారతీయ సింగిల్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బు ఖర్చు చేయరని అందరూ అనుకున్నారు. కానీ మేము ఆ అభిప్రాయాన్ని తప్పు అని చూపించాం. లాంచ్ చేసిన 6 నెలల్లోనే మేము లాభాల్లోకి వచ్చాం." అతను మరో ఆసక్తికరమైన విషయం చెబుతూ, నాట్ డేటింగ్ కేవలం మరో మ్యాట్రిమోనియల్ యాప్ కాదు. ఇది భారత మ్యాచ్ మేకింగ్ భవిష్యత్తులో ఒక కల్చరల్ బ్రాండ్‌గా మారుతోంది," అన్నారు. ఈ యాప్ ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రీమియం మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫార్మ్‌లకు కూడా సవాల్ విసురుతోంది అలాగే భారతదేశంలోని పెద్ద మ్యాట్రిమోనియల్ యాప్‌లతో పోటీ చేస్తున్నది. దీని ప్రధాన ఉద్దేశ్యం తరువాతి తరం భారతీయ సింగిల్స్ కోసం, చర్చల ద్వారా మ్యాచ్ అవ్వగల, ప్రీమియం అనుభవం ఇచ్చే ఒక సులభమైన మరియు స్మార్ట్ యాప్ తయారు చేయడం.
భారతదేశంలో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ 2025
జస్వీర్ సింగ్ చెప్పినట్లు, వచ్చే 18 నుంచి 24 నెలల్లో వివాహం చేసుకోవాలని ఆలోచన లేని వారిని మేము నిరుత్సాహపరుస్తాము. మా సబ్‌స్క్రిప్షన్ విలువైనది. మీరు సీరియస్‌గా లేకుంటే, మీ సమయాన్ని మరియు మరో వ్యక్తి సమయాన్ని వృథా చేయకండి. అతను స్పష్టంగా చెప్పాడు మీరు సీరియస్‌గా లేకపోతే, మాకు మీ డబ్బు అవసరం లేదు. మేము అవసరంలేని గందరగోళాన్ని తొలగించి, సింపుల్‌గా ఉంచుతాము మ్యాచ్, ఇన్‌ట్రో కాల్, మీటింగ్, ఫ్యామిలీ మీటింగ్. ఇది విని చాలా మంది "ఇది నిజంగా సీరియస్ మ్యాచ్మేకింగ్ ప్లాట్‌ఫార్మ్" అనిపిస్తోంది.
ఇప్పటికే లాభదాయకంగా మారిన నాట్ డేటింగ్, ఇప్పుడు తన ప్రొడక్ట్ మరియు యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచి, ప్రీమియం మెంబర్స్‌ను పెంచడం, మరియు భారత మ్యాచ్ మేకింగ్ సంస్కృతిని కొత్త దిశలో మలచడం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తానికి నాట్ డేటింగ్ యాప్ "మ్యాట్రిమోనియల్ యాప్‌లు అంటే బోరింగ్, ఫ్రీ, టైమ్ పాస్ ప్లాట్‌ఫార్మ్‌లు" అనే అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తోంది. సీరియస్‌గా, ప్రీమియంగా, మరియు టార్గెట్ ఆడియెన్స్ పై క్లియర్ ఫోకస్‌తో ముందుకు సాగుతోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications