ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ విభాగాల్లోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రిలయన్స్ జియోలోకి ఇటీవలి వరకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ వంతు వచ్చింది. ఇప్పటికే సిల్వర్ లేకు రూ.7500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తాజాగా అమెరికా దిగ్గజం కేకేఆర్ రిలయన్స్ రిటైల్ వెంచర్‌లో రూ.5,550 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడితో 1.28 శాతం వాటాను దక్కించుకోనుంది. రిటైల్ వెంచర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ కూడా ఆసక్తి చూపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి అయితే సిల్వర్ లేక్, కేకేఆర్.. రెండు దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి.

ఎక్స్చేంజీలకు సమాచారం
కేకేఆర్.. రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు కంపెనీ తెలియజేసింది. రిలయన్స్ రిటైల్‌లో 1.28 శాతం వాటా విక్రయానికి కేకేఆర్‌తో ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. డీల్ వ్యాల్యూను రూ. 5,550 కోట్లుగా తెలిపింది. దీంతో రిలయన్స్ రిటైల్ ప్రీ-మనీ ఈక్విటీ వ్యాల్యూ రూ.4.21 లక్షల కోట్లకు చేరినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు నేడు (సెప్టెంబర్23)న ఎక్స్చేంజీలకు రిలయన్స్ సమాచారం అందించింది. సిల్వర్ లేక్ రూ.7500 కోట్ల పెట్టుబడితో 1.75 శాతం వాటాను దక్కించుకుంది.

ఇదీ కేకేఆర్.. రిలయన్స్ విభాగంలో రెండో పెట్టుబడి
రిలయన్స్ సంస్థల్లో కేకేఆర్‌కు ఇది రెండో పెట్టుబడి. మే నెలలో కేకేఆర్ రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలో రూ.11,367 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కేకేఆర్ 1976లో ఏర్పాటయింది. పలు కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేస్తుంటుంది. బీఎంసీ సాఫ్టువేర్, టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్, గోజెక్ వంటి వాటిలో ప్రయివేట్ ఈక్విటీ, టెక్నాలజీ గ్రోత్ ఫండ్స్ ద్వారా ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీ 20 టెక్నాలజీ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసింది. వీటి వ్యాల్యూ 30 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. మీడియా, టెలికం కంపెనీల్లోను ఇన్వెస్ట్ చేసింది.

రిలయన్స్ షేర్ జూమ్
రిలయన్స్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్ పెట్టుబడులు పెట్టిందని తెలియడంతో కంపెనీ షేర్లు దాదాపు 2 శాతం మేర లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.11. సమయానికి రిలయన్స్ షేర్ 1.87 శాతం లాభపడి రూ.2,252 పలికింది. పెట్టుబడుల విషయం తెలియగానే ఓ సమయంలో షేర్ ఏకంగా 2.8 శాతం మేర ఎగిసి రూ.2,276ను తాకింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications