ఫిజిటల్. వినడానికి కొత్తగా ఉంది కదా? ఫిజికల్ ప్లస్ డిజిటల్ ను కలిపితే వచ్చే పదమే ఫిజిటల్. ఇదే మన ఫ్యూచర్ అంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త కిషోర్ బియాని. బిగ్ బజార్ వంటి భారీ రిటైల్ చైన్స్ ను నిర్వహించే ఫ్యూచర్ గ్రూప్ అధినేత ఐన కిషోర్ బియాని ఈ పదాన్ని తొలిసారి ఉపయోగించారు. ప్రపంచ వాణిజ్య సరళిని పసిగట్టి ... మన దేశంలో ఇక ముందు వ్యాపారం జరిగే తీరు తెన్నులను అయన విశ్లేషించారు. ఈ సందర్భంగానే కిషోర్ బియాని ఈ పద ప్రయోగం చేసారు. ఇప్పుడంతా దీనిపైనే చర్చ జరుగుతోంది. అసలు విషయానికి వస్తే... ఇండియా లో సాంప్రదాయ బద్ధంగా స్టోర్ లలోనే రిటైల్ వ్యాపారం జరిగేది.
కానీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ల రాకతో ఇండియా లో కూడా ఆన్లైన్ బిజినెస్ జోరందుకుంది. ఓ దశలో ఆన్లైన్ దెబ్బకు ఆఫ్ లైన్ వ్యాపారం కుదేలై పోయింది. ఒక్క రిటైల్ మాత్రమే కాకుండా ఫుడ్ బిజినెస్ కూడా ఆన్లైన్ కు మళ్లింది. స్విగ్గి, జొమాటో ల దెబ్బకు రెస్టారెంట్ల బిజినెస్ దెబ్బతింది. కానీ ఇక ముందు ఇండియా లో ఏ బిజినెస్ డామినెట్ చేస్తుంది. ఏది పతనం అవుతుందో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియా లో ఆన్లైన్ బిజినెస్ మొదలై కేవలం 10 సంవత్సరాలే అవుతున్నా... అది దేశమంతా విస్తరించింది. చిన్న పల్లెలకు కూడా ఆన్లైన్ లో కొనుగోలు చేసిన ఉత్పత్తులు చేరుతున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఆఫ్ లైన్ స్టోర్ బిజినెస్ పరిస్థితి ఏమిటి అన్నదే ప్రశ్నర్థకం అవుతోంది.

3-4 ఏళ్లలో ఫిజిటల్...
ప్రపంచ వ్యాప్తంగా.... ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఫిజిటల్ విధానం ఊపందుకుంది. ఇండియా లో కూడా మొగ్గ తొడుగుతోంది. వచ్చే 3-4 ఏళ్లలో ఇండియా లో ఫిజిటల్ వ్యాపారమే సాగుతుంది అని కిషోర్ బియాని జోస్యం చెప్పారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. అంటే ముందు ముందు ప్రతి బిజినెస్ కూడా అటు ఫీజికల్ స్టోర్ ను కలిగి ఉండి, డిజిటల్ సేవలు కూడా అందింస్తుంటుందని అంచనా. ఆ దిశగా ఇప్పటికే ఇండియా లో కొన్ని అడుగులు పడినట్లు అయన తెలిపారు. ఫిజికల్ స్టోర్ల కు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయని చెప్పారు. అలాగే ఆన్లైన్ లో ఉండే ప్రయోజనాలను మేళవించి, వ్యాపారాలు ఫిజిటల్ బాట పడతాయన్నారు. అంటే ప్రతి వ్యాపారానికి స్టోర్ తో పాటు వెబ్సైటు ద్వారా ఉత్పత్తులు విక్రయించే వెసులుబాటు ఉంటుంది.

అమెజాన్ తో జట్టు...
కిషోర్ బియాని కి చెందిన ఫ్యూచర్ రిటైల్ ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తో కలిసి పనిచేసేందుకు చేతులు కలిపింది. ఇందులో భాగంగా ఫ్యూచర్ కౌపోన్స్ అనే సంస్థలో అమెజాన్ రూ 1,500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ భాగస్వామ్యం ద్వారా... ఫ్యూచర్ గ్రూప్ నకు చెందిన అన్ని స్టోర్ల లోని ప్రొడక్టులను అమెజాన్ వెబ్సైటు లో అమ్మకానికి ఉంచుతారు. అలాగే, స్టోర్ల లో కూడా అమెజాన్ ఇచ్చే ఆఫర్ల ను కస్టమర్ల కు అందజేస్తారు. అంటే ఆన్లైన్ లోని ఆఫర్లు ఆఫెలైన్ లోకి, స్టోర్ల లోని ప్రోడక్టులు డిజిటల్ లోకి రూపాంతరం చెందుతున్నాయి. ఇందులో మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే... వినియోగదారులకు ఉత్పత్తుల హోమ్ డెలివరీ సేవలు సైతం అందించటం. బిగ్ బజార్ లోని ప్రొడక్టులను అమెజాన్ వెబ్సైటులో బుక్ చేస్తే... మనకు సమీపంలోని బిగ్ బజార్ నుంచి మన ఇంటికే సరుకులు డెలివరీ చేస్తారు. ఈ విధానమే ఫిజిటల్.

గేమ్ చేంజ్...
ఇండియాలో రిటైల్ బ్రాండింగ్ గేమ్ చేంజ్ అయిపోయిందని కిషోర్ బియాని అభిప్రాయం. ఒకప్పుడు ఒక బ్రాండ్ సృష్టించటం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇండియాలో ఈ-కామర్స్ విస్తరించిన తర్వాత గేమ్ మారిపోయింది. ఇప్పుడు కావాల్సిన బ్రాండును ఆన్లైన్ లో వెతికి కొనుగోలు చేసుకోవచ్చు అని అయన తెలిపారు. ఈ విధానమే ఇకపై ఒక స్థాయిలో ఉండే అన్ని రకాల వ్యాపారులు ఫాలో అవుతారని, అందుకే ఇండియాలో ఫిజిటల్ రిటైల్ దే భవిష్యత్ అని అయన విశ్వాసం. చూద్దాం ఏం జరుగుతుందో!
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications