రూ.5 లక్షల వరకు ఈజీగా లోన్.. కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా అప్లయ్ చేసుకోవాలంటే..?
కేంద్ర బడ్జెట్ 2025లో రైతులకు గొప్ప వార్త తెచ్చిపెట్టింది. ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైతులు ఇప్పుడు రూ.5 లక్షల వరకు లోన్ పొందవచ్చు, గతంలో పరిమితి రూ.3 లక్షలు ఉండేది. ఈ లోన్ మొత్తం పెరగడంతో రైతులు పంటలు నాటడం నుండి మార్కెట్లో అమ్మడం వరకు ఎక్కువ డబ్బును పొందవచ్చు.
కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. దీని వల్ల తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను సులభంగా పొందేలా చేస్తుంది, ముఖ్యంగా వడ్డీ వ్యాపారుల రుణల ఉచ్చును నివారించడానికి వారికి సహాయపడుతుంది. ఈ కార్డు పంట విత్తడం లేదా పంటకోత తర్వాత ఖర్చులు వంటి ఆర్థిక అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది.

కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి
కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) కోసం ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ రెండింటి ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ దరఖాస్తులను బ్యాంకులు, RRBలు, మైక్రోఫైనాన్స్ బ్యాంకులు ఇంకా సహకార సంఘాలలో సబ్మిట్ చేయవచ్చు. ఇందుకు దరఖాస్తుదారులు ఒక ఫామ్ నింపి డాకుమెంట్స్ సమర్పించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు అంటే బ్యాంకు వెబ్‌సైట్‌ను పెన్ చేసి ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని నింపి ఎలక్ట్రానిక్‌గా సబ్మిట్ చేయడం.
*ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, ముందుగా బ్యాంక్ వెబ్‌సైట్‌కి వెళ్లండి, ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న KCC పథకాన్ని సెలెక్ట్ చేసుకోండి.
*మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్షన్ సెలెక్ట్ చేసుకుంటే, సైట్‌కి వెళ్లి వ్యవసాయం అండ్ గ్రామీణ ట్యాబ్‌ను సెలెక్ట్ చేసుకోండి. *దరఖాస్తు ఫామ్‌ను యాక్సెస్ చేయడానికి అలాగే డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రాప్ లోన్ కింద కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
దరఖాస్తుకు అవసరమైన డాకుమెంట్స్
కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, దరఖాస్తుదారులు కొన్ని డాకుమెంట్స్ సమర్పించాలి. వీటిలో రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, గుర్తింపు ప్రూఫ్ (డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ కార్డ్ వంటివి), చిరునామా ప్రూఫ్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫై చేసిన భూమి పేపర్లు, పూర్తి పంట వివరాలు, లోన్ మొత్తం రూ. 2 లేదా 3 లక్షల కంటే ఎక్కువగా ఉంటే సెక్యూరిటీ డాకుమెంట్స్ కావాలి.
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాంకు నుండి ఫామ్‌ను పొందవచ్చు లేదా అవసరమైన డాక్యూమెంట్లతో పాటు సబ్మిట్ చేసే ముందు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫామ్ నింపేటప్పుడు మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు బ్యాంకు అధికారుల సహాయం తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications