కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. కానీ దేశంలో ఒక్క రంగం మాత్రం మెరుస్తోంది. అదే ఆఫ్ లైన్ రిటైల్ రంగం. కిరానా షాపుల నుంచి భారీ రిటైల్ స్టోర్ల వరకు మాత్రం మళ్ళీ పాత రోజులు వచ్చినట్లున్నాయి. దేశంలో ఈ కామర్స్ బూమ్ మొదలైన తర్వాత ప్రజలంతా అటు వైపే మళ్లారు. ముఖ్యంగా నగరాలూ, పట్టణాల్లోని ప్రజలు దాదాపు అన్ని రకాల కొనుగోళ్ల కోసం ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ పై ఆధారపడటం మొదలు పెట్టారు. ఇందుకు ఒక బలమైన కారణం కూడా ఉంది. ప్రతి కొనుగోలుపై ఈ కామర్స్ కంపెనీలు తప్పనిసరి డిస్కౌంట్ అందించాయి.
అది కూడా 20% మొదలు కొని 50% వరకు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షించాయి. వాటి ప్రయత్నాలు ఫలించి కస్టమర్స్ కూడా అటు వైపు మొగ్గు చూపారు. దీంతో దేశం లో కిరానా షాపులు, ఆఫ్ లైన్ సూపర్ మార్కెట్లు నడిపించే వారు చాలా ఇబ్బంది పడ్డారు. కొనుగోళ్లు తగ్గిపోయి చాలా మంది వీధిన పడ్డారు. కొందరు ఎలాగోలా నెట్టుకొస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కానీ, ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమా అని ఆఫ్ లైన్ రిటైల్ షాపులకు మళ్ళీ పాత రోజులొచ్చాయి. సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి.

మెరుగైన మార్జిన్లు...
ఈ కామర్స్ పోర్టల్స్ తో పోటీని తట్టుకునేందుకు దాదాపు అన్ని షాపులు ఎంతో కొంత డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తుండేవి. దీంతో వాటి ప్రాఫిట్ మార్జిన్లు తగ్గిపోయాయి. ఇది కేవలం కిరానా, సూపర్ మార్కెట్లకు పరిమితం కాలేదు. మెడికల్ షాప్స్ లో కూడా కనీసం 10% డిస్కౌంట్ ఇవ్వటం సర్వ సాధారణం అయ్యింది. కానీ, ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఈ కామర్స్ కంపెనీలు చాలా వరకు తాత్కాలికంగా తమ సేవలను నిలిపివేశాయి.
కొన్ని నడుస్తున్నా... వాటి సేవలు కూడా పరిమితంగానే ఉంటున్నాయి. దీంతో వినియోగదారులు అన్ని రకాల సరుకుల కొనుగోలుకు దగ్గరలోని కిరాణా షాపులు, సూపర్ మార్కెట్ల ను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటికి సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. మరోవైపు... ప్రస్తుతం ఈ షాపులు ఎలాంటి డిస్కౌంట్స్ లేకుండా ప్రతి ఉత్పత్తిని కేవలం ఎం ఆర్ పీ ధరకే విక్రయిస్తున్నాయి. దీంతో వాటి ప్రాఫిట్ మార్జిన్లు (లాభాలు) విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు పెరిగిన అమ్మకాలు, మరోవైపు మెరుగైన లాభాలతో అవి వర్ధిల్లుతున్నాయి.

కోటి కి పైగా మందికి లబ్ది...
దేశంలో కిరాణా షాపుల నిర్వహణ ఒక పెద్ద జీవనోపాధి మార్గం. ఒక అంచనా ప్రకారం భారత్ లో సుమారు 1.20 కోట్ల కిరాణా స్టోర్లు ఉన్నాయి. దాదాపు ప్రతి 1,000 మంది జనాభాకు ఒకటి చొప్పున మన దేశంలో ఈ షాపులు ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానంలో ఉంటుంది. సుమారు 1.20 కోట్ల మంది ప్రత్యక్షంగా, మరో 5 కోట్ల మంది పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.
వీరంతా ఒకప్పుడు తీవ్ర ఆందోళనతో ఉండేవారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ మాయలో పడి జనాలు కొనుగోళ్లు తగ్గించారని, భవిష్యత్ ఎలా ఉంటుందో అని బాధపడ్డారు. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో కిరాణా షాపుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ వీరికి తమ వ్యాపారంపై కొంత విశ్వాసం పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

1 ట్రిలియన్ డాలర్ మార్కెట్...
భారత రిటైల్ మార్కెట్ పరిమాణం సుమారు 1 లక్ష కోట్ల డాలర్లు ( 1 ట్రిలియన్) గా అంచనా వేస్తున్నారు. మన కరెన్సీ లో చెప్పాలంటే సుమారు రూ 75 లక్షల కోట్లు. ఇది ఏటా రెండంకెల వృద్ధిని కొనసాగిస్తోంది. ఇందులో ఆన్లైన్ విభాగం కూడా భారీగా విస్తరిస్తోంది. ప్రస్తుతం సుమారు 30 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది.
ఇది త్వరలోనే 60 బిలియన్ డాలర్లకు పెరగనుంది. మరోవైపు ఒక్క కిరాణా షాపుల వంటి రిటైల్ స్టోర్ల లోనే 2020 లో సుమారు రూ 10,000 కోట్లకు పైగా అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిణామాల్లో అది 2-3 రెట్లు అధికంగా ఉంటుందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏది ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకునే కిరాణా షాపులకు స్వల్పకాలంలో కొంత మెరుగైన లాభాలు లభిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామమే. ఇది కొన్ని కోట్ల మందికి తమ భవిష్యత్ పై భరోసాను కలిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications