రూ.60,000 పెట్టినోళ్లను కోటీశ్వరులను చేసిన కంపెనీ.. స్టాక్ పూర్తి వివరాలు..
Multibagger Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో నమ్మకంతో పెట్టుబడులు పెట్టి అదృష్టవంతులైన వారు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో చాలా మల్టీబ్యాగర్ స్టాక్స్ తమ రాబడులతో సామాన్యులను మిలియనీర్లుగా చేసేశాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న కిన్‌టెక్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ స్టాక్ సైతం లక్షాధికారులుగా తన ఇన్వెస్టర్లను మార్చేసింది. ఏడేళ్ల కిందట కంపెనీ షేర్లలో రూ.60 వేలు పెట్టినవారు ప్రస్తుతం మిలియనీర్లయ్యారు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ రంగాల్లో కంపెనీ అగ్రగామిగా ఉంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ సొంతంగా విద్యుత్ ఉత్పత్తిదారుగా కూడా ఉంది.

స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన కంపెనీ ఏడేళ్లలో ఇన్వెస్టర్లకు 17,029 శాతం రాబడిని అందించింది. అక్టోబర్ 6, 2016లో కంపెనీ షేర్ ధర బీఎస్ఈలో కేవలం రూ.28.70 వద్ద ఉంది. అయితే స్టాక్ రేటు నేడు మార్కెట్లో రూ.5,014.40 వద్ద ఉంది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ అప్పట్లో లక్ష రూపాయలతో షేర్లను కొని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వాటి విలువ రూ.1.70 కోట్లకు చేరుకుని ఉండేది. అలాగే కనీసం రూ.60,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని మార్కెట్ విలువ కోటి రూపాయలకు పైనే ఉండేది.
దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరగటంతో పాటు దేశంలో వేగంగా జరుగుతున్న పరిశ్రమల ఏర్పాటుతో ఎక్కువగా రెన్యూవబుల్ ఎనర్జీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఈ రంగంలోని కంపెనీలకు మంచి భవిష్యత్తు ఉన్నందున ఇన్వెస్టర్లు సైతం ఎక్కువగా తమ పెట్టుబడులను వీటిలో కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications