పిల్లల చదువు పేరు చెప్పి ఇప్పటికే పెంటల బిల్లులు వస్తున్నాయి" అని చెబుతున్నారు స్టార్టప్ ఫౌండర్, చార్టర్డ్ అకౌంటెంట్ దీపక్ భాటి. భారతదేశ విద్యా వ్యవస్థ ఇప్పుడు భవిష్యత్తు పైనే ధర కట్టేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీ-కెజీ నుంచి కార్పొరేట్ బడ్జెట్‌తో స్కూల్ ఫీజులు వేస్తున్నాయన్నది ఆయన గమనిక.

భవిష్యత్తులో చదువుకోవాలంటే పర్సు ఖాళీ కావాల్సిందే" అంటున్నారు స్టార్టప్ వ్యవస్థాపకుడు, చార్టర్డ్ అకౌంటెంట్ దీపక్ భాటి. భారత విద్యా వ్యవస్థ ఇప్పుడు మధ్యతరగతి కలల మీద భారీ ధరలు వేసుకుంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడే స్కూల్ ఫీజులు ఆకాశానికి ఎగసిపోయాయి. ప్రీ-కెజీ లేదా ఎల్ కెజీకి కూడా కార్పొరేట్ స్థాయిలో బిల్లులు వస్తున్నాయంటూ" ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కానీ నిజంగా ఆ మాటలు వినడానికి కాస్త కఠినంగా ఉన్నా, వెనుక ఉన్న యథార్థం మాత్రం ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రికి తాకుతుంది.
ఒకప్పుడు ఉచితంగా లభించేది అనుకునే విద్య, ఇప్పుడు ఓ కార్పొరేట్ సబ్‌స్క్రిప్షన్ లాగా మారిపోయింది. ఎలాగంటే LKG ఫీజు రూ. 1.5 లక్షలు, బస్ ఫీజు - రూ. 25,000, బుక్స్ & యూనిఫాంస్ - రూ. 7,000 పైగా "డెవలప్‌మెంట్ ఫీజు", "ఆన్‌లైన్ టెక్నాలజీ ఫీజు" అంటూ పేరు చెప్పి మరిన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదీ పిల్లల మొదటి అడుగు.
భాటీ గారు చెప్పిన ఓ గణాంకం చూస్తే షాక్ తగులుతుంది. 36% తల్లిదండ్రులు గత మూడేళ్లలో స్కూల్ ఫీజులు 50%-80% పెరిగాయని చెప్తున్నారు. 8% పేరెంట్స్ అయితే 80% కంటే ఎక్కువ పెరిగినట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలామంది కుటుంబాలు అప్పులు తీసుకుంటున్నారు, ఇతర అవసరాలపై కోతలు వేస్తున్నారు లేదా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మార్చుతున్నారు.
ప్రస్తుతం భారత విద్యా ఇన్‌ఫ్లేషన్ 8-12% సంవత్సరానికి ఉంది, ఇది దేశ సగటు ద్రవ్యోల్బణాన్ని మించిపోతోంది.
దీని వలన మధ్య తరగతి, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలపై దారుణమైన ఒత్తిడి ఉంది. చాలామంది లోన్లు తీసుకోవడం, అవసరమైన ఖర్చులకు కోత వేయడం లేదా పిల్లలను ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ స్కూల్‌కి మార్చడం జరుగుతోంది.
భాటీ గారు ఏం చెప్తున్నారు అంటే "మీ FDలు చదువు ఖర్చుల వేగానికి సరిపోవు." ఏం పని చేస్తుంది అంటే
1. ఎడ్యుకేషన్ ప్లానింగ్ కోసం చిన్న పిల్లలున్నప్పుడే ఎడ్యుకేషన్ ఫండ్ మొదలుపెట్టాలి.
2. SIPల ద్వారా లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయాలి.
౩. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ వంటివి కొంత రిస్క్ ఉన్నా మంచి రిటర్న్ ఇవ్వగలవు.
2040 నాటికి మంచి కాలేజీల ఫీజు రూ. 50 లక్షల నుండి రూ1 కోటి దాకా ఉంటుందని అంచనా. అర్థిక ఒత్తడి తో పాటు మానసిక ఒత్తిడిసైతం పెరుగుతోంది. తల్లిదండ్రులు EMIలు, ఫీజులు చెల్లించలేక కలవరపడతారు. పిల్లలపై ఆ ఒత్తిడి పడుతుంది.
ఇలా ఫీజు వాయిదా చెల్లించలేకపోతే స్కూల్ నుంచి బెదిరింపులు, అప్పుడు పిల్లలపై ఒత్తిడి మొదలవుతుంది. ఈరోజు పిల్లల చదువు ఖర్చు గురించి ఊహించలేని స్థాయికి వెళ్లిపోయింది. పిల్లలు కూడా ఈ గృహ ఒత్తిడిని అనుభూతి చెయ్యాల్సిందే. కానీ ఇప్పటికైనా జాగ్రత్తగా ప్లాన్ చేస్తే, పిల్లల భవిష్యత్తుకు సరైన దారిదొరుకుతుంది. చిన్న పిల్లల చదువు కోసం పెద్ద మనసుతో ముందుగానే ఆలోచించాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications