స్టార్టప్ ప్రారంభించాలనుకునేవారికి గుడ్ న్యూస్.., కేంద్ర ప్రభుత్వం రూ 50 లక్షల వరకు పెట్టుబడి సాయం అందిస్తోంది

మన దేశంలో చాలా మంది యువత ఉద్యోగాల కాకుండా తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నారు. వారి దగ్గర బలమైన ఆలోచన, ఆవిష్కరణ, విజన్ ఉన్నా సరైన పెట్టుబడికి డబ్బులు లేక చాలామంది ఆశలు ఆలోచనలోనే ఆగిపోతున్నాయి. ఈ సమస్యను గమనించిన కేంద్ర ప్రభుత్వం, యువ స్టార్టప్‌లకు మొదటి దశలో అవసరమయ్యే డబ్బుకు సహాయం చేయడానికి Start-up India Seed Fund Scheme (SISFS) అనే ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం వల్ల ఇప్పటివరకు వందలాది స్టార్టప్‌లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మీకూ ఇది ఒక మార్గం కావొచ్చు.

SISFS amp amp DPIIT 945 Technology-driven Business Eligibility Criteria Application Process Incubators Debt Grant Proof of Concept POC Prototype Development Product Trials Market Entry Commercialization Fund Disbursement Job Creation Startup Ecosystem Indian Promoters

స్టార్టప్ ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీమ్ (SISFS) అనేది ఇండియా ప్రభుత్వం 2021లో ప్రారంభించిన ఒక కార్యక్రమం. దీని ముఖ్య లక్ష్యం ఆరంభ దశలో ఉన్న స్టార్టప్స్ కి ఆర్థిక సహాయం అందించడం. ఇది పరిశ్రమ & అంతర్గత వాణిజ్య ప్రమోషన్‌ విభాగం (DPIIT) ద్వారా అమలు చేయబడుతోంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 945 కోట్లు బడ్జెట్‌గా కేటాయించింది. ఈ పథకం 2021 ఏప్రిల్‌ నుంచి ప్రారంభమై, నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ కాలవ్యవధిలో దేశవ్యాప్తంగా స్టార్టప్‌లకు ఆర్థిక మద్దతు అందించడం దీని ముఖ్య ఉద్దేశం అయ్యింది.

ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు?
ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే కొన్ని అర్హతలు అవసరం. ముందుగా, స్టార్టప్‌కి DPIIT గుర్తింపు ఉండాలి. అలాగే, ఆ కంపెనీ గరిష్ఠంగా రెండేళ్ల లోపు ప్రారంభమై ఉండాలి. వార్షిక టర్నోవర్ రూ. 100 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. వారి వ్యాపార మోడల్ కొత్త ఆవిష్కరణలతో పాటు టెక్నాలజీ ఆధారితంగా ఉండాలి. అలాగే, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఎనర్జీ, బయోటెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి రంగాల్లో పనిచేస్తే ఈ పథకం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. అప్లికేషన్ సమయంలో భారతీయ ప్రమోటర్ల వాటా కనీసం 51% ఉండాలి. ప్రతి స్టార్ట్‌ప్‌కు ఒక్కసారి మాత్రమే ఈ సీడ్‌ ఫండ్‌ ఋణ పరంగా ఇస్తారు.

ఈ పథకం కింద స్టార్టప్‌లకు వారి ఆవిష్కరణలను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (POC) దశ నుంచి సహాయం అందించబడుతుంది. అంతేకాక, నమూనా తయారీ (Prototype), ఉత్పత్తి పరీక్షలు (Product Trials), అలాగే మార్కెట్లోకి ప్రవేశించడం (Market Entry) మరియు వాణిజ్యీకరణ (Commercialization) వరకు కూడా పూర్తి మద్దతును ప్రభుత్వం ఈ పథకం ద్వారా కల్పిస్తుంది.

ఈ పథకం ద్వారా ప్రతి స్టార్టప్‌కు గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు గ్రాంట్ రూపంలో ఆర్థిక సహాయం లభిస్తుంది, ఇది ప్రధానంగా నమూనా తయారీ (Prototype), ఉత్పత్తి పరీక్షలు (Product Trials) వంటి ప్రారంభ దశల కోసం ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, వ్యాపారాన్ని మార్కెట్లోకి ప్రవేశింపజేయడం మరియు విస్తరించడానికి, రూ. 50 లక్షల వరకు రుణం లేదా కన్వర్టబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ రూపంలో మద్దతు లభిస్తుంది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఇన్క్యుబేటర్లు ద్వారా స్టార్టప్‌లకు అందజేస్తారు. ఈ నిధులను భవనాలు లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం వంటి అవసరాలకు ఉపయోగించరాదు స్కీమ్‌కు సంబంధించిన పనులకే వినియోగించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?
1. https://seedfund.startupindia.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. 'Apply Now' మీద క్లిక్ చేసి, లాగిన్ అయ్యి, అప్లికేషన్ ఫార్మ్‌ నింపాలి.

2. స్టార్టప్ వివరాలు, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

3. మీ ప్రాంతంలోని లేదా రంగానికి తగిన ఇన్క్యుబేటర్‌ను ఎంపిక చేయండి. ఎవరైనా మూడు ఇన్కుబేటర్ల వరకు ప్రాధాన్య క్రమంలో అప్లై చేయొచ్చు.

4. పరిశీలన తరువాత మీరు ఎంపికైతే, నిధులు మీకు పడిపోతాయి.

ఈ స్కీం లక్ష్యం, పరిధి చాలా స్పష్టంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా 4 ఏళ్లలో 3,600 స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. ఇందుకోసం ఇప్పటికే రూ. 945 కోట్లు బడ్జెట్‌గా కేటాయించింది. ఈ నిధులను దేశవ్యాప్తంగా 300 గుర్తింపు పొందిన ఇన్క్యుబేటర్ల ద్వారా స్టార్టప్‌లకు పంపిణీ చేస్తారు, తద్వారా వ్యాపార ఆలోచనల నుంచి మార్కెట్ స్థాయికి వెళ్లే ప్రయాణంలో స్టార్టప్‌లకు గట్టి మద్దతుగా నిలుస్తుంది.

2024 నాటికి, ఈ స్కీం ద్వారా కొంత వరకు ప్రగతి కనిపించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 126 ఇన్క్యుబేటర్లను ఎంపిక చేసింది. వీటి ద్వారా మొత్తం రూ. 180 కోట్లకు పైగా నిధులు స్టార్టప్‌లకు అందజేయబడ్డాయి. ఈ సహాయంతో అనేక మంది యువులు తమ మొదటి డబ్బుతో తమ సొంత స్టార్టప్‌లను ప్రారంభించే అవకాశాన్ని పొందారు. అయితే, కొన్ని చోట్ల ఇన్క్యుబేటర్ల స్పందన ఆలస్యంగా ఉండటం వల్ల దరఖాస్తు ప్రక్రియ క్లిష్టంగా ఉండటం వంటి సమస్యలు ఉన్నట్లు ఫీడ్‌బ్యాక్ లభించింది. దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+