దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఇటీవల భారత మార్కెట్లో సెల్టోస్ SUV కారు ధరలను పెంచింది. మోడల్ ఆధారంగా రూ.20,000 నుంచి రూ.35,000 వరకు పెంచింది. గత ఏడాది ఆగస్ట్ నెలలో విడుదలైన ఈ కారు ప్రారంభ ధర రూ.9.69 లక్షలుగా ఉంది.
పెంపు తర్వాత దీని ధర రూ.9.89 లక్షల నుంచి ఉంటుంది. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా, రెనో సంస్థలు గత నెలలో కార్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే.

ఈ ధరలు జనవరి 1, 2020 నుంచి అమలులోకి వచ్చాయి. పెంపు అనంతరం రూ.9.69 లక్షల నుంచి రూ.16.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉన్న కార్ల ధరలు ఈ నెల నుంచి రూ.9.89 లక్షల నుంచి రూ.17.34 లక్షలకు పెరుగుతున్నాయి.
కియా సెల్టోస్ పెట్రోల్ వర్షం కారు రూ.9.89 లక్షల నుంచి రూ.14.09 లక్షల మధ్య ఉంటుంది. వీటి ధరలు మోడల్ హెచ్‌టీఈ వేరియంట్ ఆధారంగా రూ.20,000 నుంచి రూ.30,000 మధ్య పెరిగాయి. SUV టర్బో పెట్రోల్ వర్షన్ రూ.30,000 పెరిగింది. సెల్టోస్ డీజిల్ వర్షన్ రూ.35,000 పెరిగింది. దీని ధర రూ.10.34 లక్షల నుంచి రూ.17.34 లక్షల మధ్య ఉంది.


Click it and Unblock the Notifications