డిసెంబర్ 2025లో దేశవ్యాప్తంగా కార్ల కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కియా ఇండియా భారీ అమ్మకాల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ పాన్-ఇండియా ఇయర్-ఎండ్ సేల్స్ క్యాంపెయిన్‌లో భాగంగా, ఎంపిక చేసిన వాహనాలపై రూ. 3.65 లక్షల వరకు సంవత్సరాంతపు ప్రయోజనాలు అందిస్తున్నట్లు కియా కంపెనీ ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌లు డిసెంబర్ నెల మొత్తం చెల్లుబాటులో ఉండగా, కియా పోర్ట్‌ఫోలియోలోని అనేక ప్రముఖ కార్ల మోడళ్లకు వర్తిస్తాయి.
Kia వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరాంతపు ప్రయోజనాలు సెల్టోస్ పాత స్టాక్, సోనెట్, సైరోస్, కారెన్స్ క్లావిస్ (ICE అలాగే EV వెర్షన్లు), ప్రీమియం MPV కార్నివాల్ వంటి మోడళ్లపై అందుబాటులో ఉన్నాయి. ప్రతి మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ప్రయోజనాల రూపం మారుతూ ఉంటుంది. ఇందులో నగదు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్లు, లాయల్టీ బోనస్‌లు, అలాగే కార్పొరేట్ కస్టమర్లకు ప్రత్యేక పథకాలు ఉన్నాయి. అయితే ఈ ఆఫర్‌లు స్టాక్ లభ్యతపై ఆధారపడి ఉంటాయని.. అలాగే అన్ని వేరియంట్‌లకు ఒకే విధంగా వర్తించవని కియా స్పష్టం చేసింది.

డిసెంబర్ నెలలో కొత్త క్యాలెండర్ సంవత్సరానికి ముందు ఇన్వెంటరీని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో చాలా కార్ల తయారీదారులు ఆకర్షణీయమైన ఆఫర్‌లను ప్రకటిస్తున్న నేపథ్యంలో.. కియా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. సంవత్సరం ముగింపు సమయంలో అమ్మకాల వాల్యూమ్‌ను పెంచుకోవడం, అలాగే కొత్త కస్టమర్లను ఆకర్షించడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా, ICE వాహనాల (Internal Combustion Engine - ICE) మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఈ ఆఫర్‌ల పరిధిలోకి తీసుకురావడం ద్వారా.. భారత మార్కెట్లో కియా తన మిశ్రమ పవర్‌ట్రెయిన్ వ్యూహాన్ని ప్రతిబింబిస్తోంది.
ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ఉన్న కియా డీలర్ నెట్‌వర్క్ అంతటా అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్లు తమకు సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌లను సందర్శించడం ద్వారా లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్, మై కియా యాప్ ద్వారా వాహనాలను బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరాంతపు ప్రయోజనాలు కేవలం డిసెంబర్ 2025కి మాత్రమే వర్తిస్తాయని, ప్రచార గడువు ముగిసిన తర్వాత ఇవి కొనసాగవని కియా స్పష్టంగా తెలిపింది.
ఈ ప్రచారంపై కియా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ స్పందిస్తూ.. 2025 కియా ఇండియాకు ఎంతో కీలకమైన సంవత్సరం అని అన్నారు. కస్టమర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇన్స్పైరింగ్ డిసెంబర్ ప్రచారం ద్వారా తమపై నమ్మకం ఉంచిన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, కియా డిజైన్, సాంకేతికత, యాజమాన్య శ్రేష్ఠతను మరింత మంది అనుభవించేలా చేయాలనే ఉద్దేశం ఉందని ఆయన తెలిపారు. అలాగే కొత్త కస్టమర్లను కియా కుటుంబంలోకి స్వాగతించడంతో పాటు, ఇప్పటికే ఉన్న కస్టమర్లతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications