అనంతపురం: కియా మోటార్స్ షిఫ్టింగ్ వార్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టి పారేసింది. అనంతపురం జిల్లాలోని కియా ప్లాంటును తమిళనాడుకు తరలించేందుకు యాజమాన్యం అధికారులతో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే కియా యాజమాన్యం స్పందించింది. అవన్నీ అసత్యమని, ప్లాంట్ షిఫ్ట్ వార్తలు చూసి షాకయ్యామని కియా మోటార్స్ ప్రతినిధులు చెబుతున్నారు.దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది.

ఖండించిన ప్రభుత్వం
అనంతపురం నుంచి కియా మోటార్స్ ప్లాంట్ తరలింపు వార్తలు అవాస్తవాలు అని, మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తున్నామని ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ కామర్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్ఘవ అన్నారు. కియా మోటార్స్ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పని చేస్తోందన్నారు. 'కియా మోటార్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయి. ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాము' అని రజత్ భార్గవ అన్నారు.

వచ్చే వారంలో స్పష్టత అంటూ..
కియా రాష్ట్రంలో సమస్యలు ఎదుర్కొంటోందని, వారు తమతో ప్రాథమికంగా చర్చలు జరిపారని, వచ్చే వారం కార్యదర్శిస్థాయి సమావేశం ఉందని, అప్పుడు పూర్తి స్పష్టత రావొచ్చునని ఇంగ్లీష్ మీడియాలో బుధవారం వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ఆలోచనే లేదని ఇటు ప్రభుత్వం, అటు కియా మోటార్స్ చెబుతోంది.

కియా మోటార్స్‌తో ఉపాధి
అనంతపురంలోని కియా మోటార్స్ ప్లాంట్ వ్యాల్యూ 1.1 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో కియా కియా కంపెనీ ఐదో అతి పెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది. ఈ ప్లాంటు నిర్మాణానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. 2018లో కియా మోటార్స్‌ను ప్రారంభించారు. అనంతపురంలోని కియా మోటార్స్ ఉత్పత్తి సామర్థ్యం 3,00,000. ఈ సామర్థ్యాన్ని రానున్న ఏళ్లలో మరింత పెంచాలని భావిస్తున్నారు. ఈ ప్లాంట్ వల్ల వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.


Click it and Unblock the Notifications