Kia Syros: టాటా-మహీంద్రాలకు పోటీగా కియా.. సరికొత్త కియా సిరోస్ ఎస్‌యూవీ స్పెషల్ ఫీచర్స్
Kia Syros SUV Launch: భారతీయ మార్కెట్లోకి ఆటో రంగంలోని అనేక కంపెనీలు ఇటీవలి కాలంలో ప్రస్తుతం కొత్తగా అనేక మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రధాన కంపెనీలు తమ ఈవీ మోడళ్లను సైతం విస్తృతంగా విడుదల చేస్తూ యూజర్లను ఆకర్షిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లో సౌత్ కొరియా ఆటోమేకర్ కియా కొత్త SUVని పరిచయం చేసింది. కియా సిరోస్ ఎస్‌యూవీలో కియా ఎలాంటి ఫీచర్లు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సరికొత్త ఎస్‍యూవీ అత్యుత్తమ డిజైన్, గొప్ప ఫీచర్లను అందిస్తోంది. సరికొత్త కారు మరింత విశాలమైన స్పేస్ కలిగి ఉంది. రిక్లైనింగ్ రియర్ సీటు సౌకర్యం కూడా ఉంది. కియా తన కారు బుకింగ్స్ జనవరి 3, 2024 నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది. పైగా ఈ కారు మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, త్వరలో విడుదలకానున్న స్కోడా కైలాక్ వంటి వాటిపై ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ ఫీచర్లను పరిశీలిస్తే..

కియా సిరోస్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కోసం 5-అంగుళాల స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎస్‌యూవీ కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌తో కూడిన సెంటర్ కన్సోల్‌ను కలిగి ఉంది. డ్యూయల్ స్క్రీన్‌లతో డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌ను కలిగి ఉండనుంది. అలాగే లెవల్ 2 ADAS, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఒక పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్టెన్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లను అందించనుంది. పైగా 360-డిగ్రీ కెమెరా సౌకర్యం కూడా కలిగి ఉండనుంది. వీటికి తోడు వెనుక సన్‌షేడ్, యాంబియంట్ లైటింగ్, ట్విన్ USB-C పోర్ట్‌లు, 8-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది.
Kia Syros SUV ఇంజిన్..
కంపెనీ 1 లీటర్ కెపాసిటీ కలిగిన టర్బో పెట్రోల్ స్మార్ట్‌స్ట్రీమ్ ఇంజన్‌ను కొత్త కియా సిరోస్ ఎస్‍యూవీలో కలిగి ఉండనుంది. దీని కారణంగా సిరోస్ 120 PS పవర్, 172 న్యూటన్ మీటర్ల టార్క్ పొందుతుంది. పైగా 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌తో మార్కెట్లోకి వస్తోంది. దీనికి 1.5 లీటర్ కెపాసిటీ గల డీజిల్ ఇంజన్ కూడా అందించబడింది. ఇది 116 PS పవర్, 250 న్యూటన్ మీటర్ల టార్క్ కలిగి ఉండనుంది. ప్రస్తుతం దేశంలోని ఎస్‍యూవీ మార్కెట్లో 15 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ కేటగిరీల్లో 20 శాతం మార్కెట్ వాటాను హోల్డ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కియా ఇండియా ఈ సంవత్సరం దాదాపు 3 లక్షల యూనిట్లను విక్రయించాలని చూస్తోంది. కంపెనీ తన కొత్త ఎన్‍యూవీల డెలివరీని ఫిబ్రవరి 2025 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications