Gurpatwant Pannun: టార్గెట్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ హెచ్చరిక..
Stock Market: ఖలిస్తానీ వేర్పాటువాది, సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ఏకంగా భారత స్టాక్ మార్కెట్లను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగారు.
1993 ముంబై పేలుళ్ల 31వ వార్షికోత్సవం సందర్భంగా మార్చి 12న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE)లను లక్ష్యంగా చేసుకోవడానికి తన అనుచరులకు పిలుపునిచ్చారు. వాస్తవంగా 1993లో వరుస బాంబు పేలుళ్లలో భాగంగా బీఎస్ఈ భవంలో ఒక కారు బాంబు పేలిన సంగతి తెలిసిందే. భారత్ ఉగ్రహవాదిగా గుర్తించిన గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ప్రస్తుతం భారతదేశాన్ని ఆర్థికాన్ని లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇందులో భాగంగా భారతీయ ఈక్విటీ మార్కెట్లలో స్టాక్ లను డంప్ చేయాలని పిలుపునిచ్చారు. దేశీయ మార్కెట్లలో పెట్టుబడులను విక్రయించి ఆ మెుత్తాన్ని అమెరికన్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టాలని ప్రజలను కోరారు. పన్నూన్ బెదిరింపులు ప్రజాభిప్రాయ సేకరణ ప్రచారంలో విఫలమైన తర్వాత ఆర్థికంగా లబ్ధి పొందే పథకంలో ఒక భాగమై ఉండవచ్చని భారతీయ ఇంటెలిజెన్స్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఖలిస్తానీ నాయకుడు పన్నూన్ ఇటీవలి కాలంలో రెచ్చగొట్టే చర్యల్లో పాల్గొన్నాడు. ఇందులో భారత పార్లమెంటుపై దాడి చేస్తానని బెదిరింపు, ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకోవాలని కోరడం వంటివి ఉన్నాయి. దీనిని భారత ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఉగ్రవాది ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేయగా, అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి చర్యలు తీసుకుంది. అలాగే భారత ప్రభుత్వం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం UAPA కింద అతనిని "వ్యక్తిగత తీవ్రవాది"గా పేర్కొంది.
దీనికి ముందు నవంబరులో ఖలిస్తానీ ఉగ్రవాది ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తానని బెదిరించాడు. నవంబర్ 19 న విమానయాన సంస్థలో ప్రయాణించవద్దని ప్రజలను కోరాడు. అలాగే కొన్ని నెలల కిందట కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను గుర్తు తెలియని దుండగులు హతమార్చటంతో బెదిరింపులు పెరిగాయి. 2001లో ఉగ్రవాదులు పార్లమెంట్‌పై దాడి చేసి వార్షికోత్సవం జరుపుకునే డిసెంబర్ 13న లేదా అంతకంటే ముందు భారత పార్లమెంటుపై దాడి చేస్తామని గత నెలలో బెదిరించారు.


Click it and Unblock the Notifications