ఇంటర్నెట్ ప్రపంచంలో ఖాబీ లేమ్ (Khaby Lame) పేరు తెలియని వారు ఉండరు. ఎటువంటి డైలాగులు లేకుండా.. కేవలం తన ముఖ కవళికలు , చేతి సైగలతో ప్రపంచాన్ని నవ్వించిన ఈ టిక్ టాక్ స్టార్.. ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో ఒక భారీ సంచలనానికి తెరలేపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో తనకంటూ ఒక 'డిజిటల్ ట్విన్' (Digital Twin)ను సృష్టించుకోవడానికి ఏకంగా $975 మిలియన్ల (సుమారు రూ. 8,000 కోట్లు) ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక సాధారణ సోషల్ మీడియా క్రియేటర్ ఈ స్థాయిలో బిజినెస్ డీల్ చేసుకోవడం ఇదే మొదటిసారి.

ఏమిటీ డిజిటల్ ట్విన్ డీల్?
రిచ్ స్పార్కల్ హోల్డింగ్స్ అనే సంస్థ ఖాబీ లేమ్ (Khaby Lame) కి చెందిన కోర్ కంపెనీని ఆల్-స్టాక్ ట్రాన్సాక్షన్ ద్వారా కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఖాబీ లేమ్ యొక్క ముఖం, వాయిస్ ప్యాటర్న్స్ , అతని హావభావాలకు సంబంధించిన పూర్తి డేటాను ఉపయోగించే హక్కులను ఆ సంస్థ పొందింది. దీని సాయంతో ఖాబీకి సంబంధించిన ఒక ఏఐ (AI) వర్చువల్ మోడల్ ను తయారు చేస్తారు. అంటే.. ఖాబీ నేరుగా షూటింగ్ లో పాల్గొనకపోయినా ఈ 'డిజిటల్ ఖాబీ' కొత్త వీడియోలు చేయగలదు, వివిధ భాషల్లో మాట్లాడగలదు , లైవ్ స్ట్రీమ్స్ కూడా నిర్వహించగలదు. ఇది ఒక రకంగా అతని బ్రాండ్ ను మనిషితో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ఉపయోగపడుతుంది.
కార్మికుడి నుండి బిలియనీర్ వరకు..
2020 లో కోవిడ్ సమయంలో ఫ్యాక్టరీ ఉద్యోగం కోల్పోయిన ఖాబీ లేమ్ (Khaby Lame).. కాలక్షేపం కోసం టిక్‌టాక్ వీడియోలు చేయడం ప్రారంభించారు. కాంప్లికేటెడ్ లైఫ్ హ్యాక్స్ ను వెక్కిరిస్తూ ఆయన చేసే సైలెంట్ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆయనకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నింటిలో కలిపి 350 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎటువంటి భాషా భేదం లేకుండా కేవలం సైగలతో అందరినీ ఆకట్టుకోవడం ఖాబీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. అందుకే ఇప్పుడు టెక్ కంపెనీలు అతని గుర్తింపును (Identity) ఒక అసెట్ గా మార్చుకోవడానికి పోటీపడుతున్నాయి.
భవిష్యత్తులో మార్పులు ఎలా ఉండబోతున్నాయి?
ఈ డీల్ ద్వారా ఏటా $4 బిలియన్ల సేల్స్ సాధించాలని రిచ్ స్పార్కల్ హోల్డింగ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. అడ్వర్టైజింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ , డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఈ AI ఖాబీని వాడబోతున్నారు. ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేకుండానే ప్రపంచంలో ఎక్కడైనా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం దీనివల్ల సాధ్యమవుతుంది. అయితే ఒక సెలబ్రిటీ తన గుర్తింపును ఇలా AI కి అప్పగించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏది ఏమైనా ఇది ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ లో కొత్త శకానికి నాంది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపై ప్రమోషన్స్ కు స్టార్స్ అవసరం లేదని చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో మనకు నచ్చిన స్టార్స్ మరణించినా లేదా రిటైర్ అయినా.. వారి 'డిజిటల్ ట్విన్స్' మనల్ని అలరిస్తూనే ఉంటాయన్న మాట.
More From GoodReturns

ఉచితంగా AI కోర్సులు నేర్చుకునే అవకాశం! ఎలా రిజిస్టర్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

AI jobs: 2030 కల్లా సగం ఉద్యోగాలు మాయం! మీ జాబ్ సేఫ్ గా ఉండాలంటే ఈ మార్పు తప్పనిసరి!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications