Onion Price: మనిషి బతకటానికి అత్యంత అవసరమైనది ఆహారం. అందులోనూ ఉల్లిపాయ లేకుండా వంటలు చేసుకోవటం అసాధ్యం. ఇప్పటి వరకు పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ దేశాల సరసన మరో దేశం కూడా చేరింది. అక్కడి ప్రజలకు ఉల్లి రేట్లు వింటేనే కన్నీళ్లు వస్తున్నాయి. ఉల్లి ధర దాదాపు కిలో జీడిపప్పు రేటుకు చేరుకోవటంతో అసలు తినేదెలా అంటూ సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

చికెన్ రేటుకంటే..
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఫిలిప్పీన్స్ దేశంలో దిగజారిన పరిస్థితుల గురించే. ప్రస్తుతం అక్కడ శ్రీలంక, పాకిస్థాన్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కిలో చికెన్ రేటు దాదాపు రూ.300 వద్ద ఉంటే.. ఉల్లిపాయల రేట్లు మాత్రం దీనికి మూడు రెట్లు అధికంగా రూ.900కు చేరుకుంది. అసలు ఉల్లి రేటు వినగానే అక్కడి ప్రజలు కంటతడి పెట్టుకునే పరిస్థితి వచ్చింది.

తాజా నివేదిక..
బీబీసీ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం.. ఫిలిప్పీన్స్‌లో కిలో ఉల్లిపాయ ధర ఈ వారం 11 డాలర్లుగా ఉంది. అంటే మన భారత కరెన్సీ లెక్కల ప్రకారం సుమారు కిలో ఉల్లి ధర రూ.900 అనమాట. అక్కడ కిలో చికెన్ ధర 4 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇతర మాంసపు ఉత్పత్తుల ధరలు సైతం అధికంగా ఉన్నాయని వెల్లడైంది. అయితే ప్రస్తుతం భారత దేశంలో ఉల్లి ధర వివిధ క్వాలిటీల ప్రకారం రూ.20 నుంచి రూ.30 మధ్య ఉంది.

జీతం కంటే ఎక్కువ..
ఫిలిప్పీన్స్‌లో సగటు కార్మికుని ఒక రోజు వేతనం కంటే ఉల్లిపాయల రేటు అధికంగా ఉంది. వ్యాపారులు చైనా నుంచి బట్టల పేరుతో అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న 3,10,000 డాలర్ల విలువైన ఉల్లని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి వ్యవసాయ శాఖ విడుదల చేసిన ఉల్లి ఉత్పత్తి అంచనా ఫలితంగా ఉత్పత్తి తగ్గింది. దీనికి తోడు తీవ్ర తుఫాను కారణంగా పంట భారీగా నష్టపోయిందని తెలుస్తోం

కూలిన ప్రభుత్వాలు..
ఉల్లి సాధారణమైనది కాదు. 1998లో దిల్లీలోని ప్రభుత్వాన్ని కూల్చటానికి పెరిగిన ఉల్లి ధర ప్రధాన కారణంగా నిలిచింది. అప్పట్లో ఉల్లి ధర రూ.60కి చేరుకోవటంతో బీజేపీ అప్పటి దిల్లీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మను తొలగించి సుష్మాస్వరాజ్‌ని సీఎం చేసింది. 1980లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గెలవటానికి ఉల్లి సాయం చేసింది. అప్పట్లో అటల్ బిహార్ వాజ్ పేయిని సైతం ఉల్లి కుదిపేసింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications