హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి
హోమ్ లోన్ దీర్ఘకాలానికి సంబంధించిన కల. ఇంటిని కొనుగోలు చేయడం అంటే చేతిలో పెద్ద మొత్తం ఉండాల్సిందే. లేదంటే బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకోవాలి. రుణ మొత్తం పెద్ద మొత్తం కాబట్టి ఇందుకు దరఖాస్తు చేసుకోవాలి. మీ ఉద్యోగం, వ్యాపారం, అనుభవం, మీ క్రెడిట్ హిస్టరీ, ఇంటి వ్యాల్యూ ఆధారంగా మీకు రుణం వస్తుంది. అలాగే వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. ఏదైనా బ్యాంకులో రుణం తీసుకోవడానికి మనకు సరైన కాలవ్యవధిని, తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకును, మనకు అవసరమైన మొత్తం వచ్చే బ్యాంకును ఎంచుకోవాలి.
మీరు కొనుగోలు చేయాలనుకున్న ఆస్తిని బట్టి కాలపరిమితి ఉంటుంది. హోమ్ లోన్ వ్యవధి కనిష్టంగా అయిదేళ్లు, గరిష్టం 30 ఏళ్లు ఉంది. ఇంటిని కొనుగోలు చేసేవారు ఈఎంఐ భారాన్ని తక్కువగా చేసుకోవడానికి అయిదు నుండి పదిహేనేళ్లకు బదులు సాధారణంగా 20 నుండి 20 ఏళ్లను ఎంచుకుంటారు. రుణ కాలపరిమితిని ఇష్టారీతిన కాకుండా మన ఆదాయాన్ని బట్టి ఎంచుకోవాలి. హోమ్ లోన్ తీసుకునే సమయంలో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

డౌన్ పేమెంట్‌ను పరిగణలోకి తీసుకోవాలి. బ్యాంకులు హోమ్ లోన్ పైన 75 శాతం నుండి 90 శాతం వరకు రుణాలు అందిస్తాయి. మిగతా మొత్తాన్ని మన చేతిలో అట్టిపెట్టుకోవాలి.
ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ ఉంటే హోమ్ లోన్ వడ్డీ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ 750 పాయింట్లకు పైగా ఉండటం మంచిది.
హోమ్ లోన్ తీసుకున్నప్పుడు తీసుకున్న మొత్తంపై వడ్డీ రేటుతో పాటు ఇతర ఛార్జీలు ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు, లేట్ పేమెంట్ పెనాల్టీ, ఫోర్-క్లోజర్ ఛార్జీలు వంటివి ఉంటాయి.


Click it and Unblock the Notifications