Quant Mutual Funds: దేశంలోని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ హౌస్ క్వాంట్ అనైతిక ఫ్రంట్ రన్నింగ్ కి పాల్పడిందనే ఆనుమానంతో సెబీ సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు గందరగోళంలో ఉన్నారు. దీని ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళనలు వారిలో కొనసాగుతున్నాయి.
మ్యూచువల్ ఫండ్ కంపెనీకి చెందిన ముంబై ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాదు కార్యాలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తాజాగా సెర్చ్ నిర్వహించింది. ఈ ప్రభావం ప్రస్తుతం కంపెనీకి చెందిన 79 లక్షల మంది పెట్టుబడిదారులపై పడింది. ఈ చర్యలపై చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కంపెనీ మే 2024 నాటికి రూ.84,000 కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కలిగి ఉంది. కంపెనీకి చెందిన వివిధ పండ్ స్కీమ్స్ ద్వారా వీటిని ఫండ్ హౌస్ నిర్వహిస్తోంది.

ఏ ఫండ్స్ ఎంత నిధులను నిర్వహణలో కలిగి ఉన్నాయి:
- క్వాంట్ మల్టీ అసెట్ ఫండ్: రూ.2,400 కోట్లు
- క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్: రూ.6,272 కోట్లు
- క్వాంట్ క్వాంటల్ ఫండ్: రూ.2,409 కోట్లు
- క్వాంట్ వాల్యూ ఫండ్: రూ.1,808 కోట్లు
- క్వాంట్ లార్జ్ క్యాప్ ఫండ్: రూ.1,168 కోట్లు
- క్వాంట్ డైనమిక్ అసెట్ అలోకేషన్ ఫండ్: రూ.1,148 కోట్లు
- క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్: రూ.1,277 కోట్లు
- క్వాంట్ BFSI ఫండ్: రూ.560 కోట్లు
- క్వాంట్ హెల్త్‌కేర్ ఫండ్: రూ.287 కోట్లు
- క్వాంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్: రూ.787 కోట్లు
- క్వాంట్ మొమెంటం ఫండ్: రూ.1,920 కోట్లు
- క్వాంట్ కమోడిటీస్ ఫండ్: రూ.368 కోట్లు
- క్వాంట్ కన్స్మ్షన్ ఫండ్: రూ.262 కోట్లు
- క్వాంట్ PSU ఫండ్ విలువ: రూ.884 కోట్లు
గతంలో ఫండ్ హౌస్‌లపై ఫ్రంట్ రన్నింగ్ ఆరోపణలు:
దేశీయ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఫ్రంట్-రన్నింగ్ ఆరోపణలు, కేసుల సెటిల్మెంట్లలో ఇదేమీ మెుదటిది కాదు. ప్రస్తుతం సెబీ చర్యలతో క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటికీ గతంలో అనేక ఇతర ఫండ్ హౌసెస్ సైతం ఇలాంటి ఆరోపణలను ఎదుర్కోవటంతో పాటు వాటిని పరిష్కరించుకున్నాయి. వాటి వివరాలను పరిశీలిస్తే..
* ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ (ఏప్రిల్ 2024): SEBI వద్ద ఫండ్ హౌస్ రూ.3 కోట్ల పెనాల్టీ చెల్లింపుతో పాటు ఆరు నెలల తాత్కాలిక నిషేధంతో కేసును పరిష్కరించుకుంది.
* యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ (మార్చి 2023): వీరేష్ జోషితో పాటు మరో 20 మందిని క్యాపిటల్ మార్కెట్స్ నుంచి SEBI నిషేధించింది. అలాగే రూ.30.5 కోట్ల లాభాలను స్వాధీనం చేసుకుంది.
* డ్యుయిష్ మ్యూచువల్ ఫండ్ (డిసెంబర్ 2021): ఫండ్ మేనేజర్ ఆకాష్ సింఘానియా, అతని తల్లిదండ్రులు రూ.5 కోట్లు చెల్లించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద కేసును పరిష్కరించుకున్నారు.
* HDFC AMC (సెప్టెంబర్ 2019): రెండు సంస్థలు రూ.10 కోట్లు చెల్లించిన తర్వాత 12 ఏళ్ల నాటి కేసును సెబీ వద్ద ఫండ్ హౌస్ పరిష్కరించుకుంది.


Click it and Unblock the Notifications