కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఏడాదికి రెండుసార్లు ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఫైనాన్షియల్ స్టేబిలిటీ నివేదిక-FSR)ను విడుదల చేస్తుంది. ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలి (ఫైనాన్షియల్ స్టేబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదికను విడుదల చేస్తుంది. ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని 2008లో రఘురాం రాజన్ కమిటీ సూచించింది. ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి మండలికి కేంద్రఆర్థికమంత్రి చైర్‌పర్సన్‌గా ఉంటారు. ఆర్బీఐ గవర్నర్, ఇతర ఆర్బీఐ సీనియర్ అధికారులు సభ్యులుగా ఉంటారు. FSRలో భాగంగా సిస్టమెటిక్ రిస్క్ సర్వేను నిర్వహిస్తుంది. గ్లోబల్, ఫైనాన్షియల్, మాక్రో ఎకనమిక్, ఇనిస్టిట్యూషనల్, జనరల్.. ఐదు వివిధ రకాల రిస్క్‌లపై ఆర్థిక వ్యవస్థను అంచనా వేయమని ఆర్థిక నిపుణులను, మార్కెట్ భాగస్వాములను కోరుతుంది.

ఆర్థిక స్థిరత్వ స్థితి
FSR విడుదలలో భాగంగా ఆర్బీఐ గతవారం దీనిని విడుదల చేసింది. ఇది దేశంలో ఆర్థిక స్థిరత్వ స్థితిని వెల్లడిస్తుంది. అన్ని ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల నుండి వచ్చిన సహకారాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత దీనిని తయారు చేస్తారు. అన్ని రకాల బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ రుణ సంస్థలు వంటి వివిధ ఆర్థిక సంస్థల ప్రస్తుత స్థితిని వివరిస్తుంది. ఇది క్రెడిట్ వృద్ధి స్థితిని, రుణగ్రహీతలు రుణాలను తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ అవుతున్న రేటును కూడా మ్యాప్ చేస్తుంది.
వీటిపై నిర్ధారణకు రావడానికి ఆర్బీఐ ప్రపంచ, దేశీయ ఆర్థిక వ్యవస్థ.. రెండింటి స్థితిని పరిశీలిస్తుంది. ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా వృద్ధి చెందకపోతే వివిధ వేరియేబుల్స్ ఎలా ప్రభావితమవుతాయో తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు నిర్వహిస్తుంది.

ఏడాదికి రెండుసార్లు
ప్రతి ఏడాది రెండుసార్లు ప్రచురితమయ్యే FSRలో భాగంగా ఆర్బీఐ సిస్టమెటిక్ రిస్క్ సర్వేను కూడా నిర్వహిస్తుంది. ఇందులో ఆర్థిక వ్యవస్థను ఐదు రకాల రిస్క్‌లపై అంచనా వేయమని నిపుణులు, మార్కెట్ పార్టిసిపెంట్స్‌ను కోరుతుంది. ప్రపంచ, ఆర్థిక, స్థూల ఆర్థిక, సంస్థాగత, సాధారణ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది.
FSRను చదివితే మన ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంది లేదా ఎంత బలహీనంగా ఉందో వెల్లడవుతుంది. మన బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు భవిష్యత్తు వృద్ధికి ఏ మేరకు తోడ్పడుతాయనే అంశాన్ని కూడా వెల్లడిస్తుంది.

ఆర్థిక వ్యవస్త పుంజుకుంది
2021 జూలై FSR ప్రచురించిన తర్వాత మళ్లీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో కరోనా తిరిగి పెరగడం, సరఫరాకు అంతరాయం ఏర్పడటం, నిరందర ద్రవ్యోల్భణ ఒత్తిళ్లు కూడా కనిపించాయి. అధిక వ్యాక్సినేషన్ కలిగిన దేశాల్లోను ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నాయి. ఉదాహరణకు వరల్డ్ ఆర్గనైజేషన్ గూడ్స్ ట్రేడ్ బారోమీటర్ ప్రకారం 2021 క్యాలెండర్ ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో వరల్డ్ మర్చంటైజ్డ్ ట్రేడ్ వ్యాల్యూమ్ ఏడాది ప్రాతిపదికన 22.4 శాతం పెరిగింది. అయితే రెండో సంవత్సరంలో మాత్రం మందగించింది. ఇందుకు కరోనా పెరగగడం, సరఫరాలకు అంతరాయం ఏర్పడటం కారణం.


Click it and Unblock the Notifications