Stock Market: ఈ మార్కెట్లను శాశించే అంశాలివే.. ట్రేడ్ చేసేముందు ఇన్వెస్టర్లూ జాగ్రత్త..
Market Next Week: దేశీయ స్టాక్ మార్కెట్లు గతవారం ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ ఊహించని రీతిలో కొత్త గరిష్ఠాల దిశగా ర్యాలీ చేశాయి. అయితే మార్కెట్లలో ప్రస్తుతం ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టాలా లేక ఉపసంహరించుకోవాలా అనే విషయంపై ఆందోళన చెందుతున్నారు.
ఈ వారం స్థానిక స్టాక్ మార్కెట్ల దిశను దేశీయంగా స్థూల ఆర్థిక డేటా, గ్లోబల్ ట్రెండ్‌లు నిర్ణయిస్తాయి. దేశీయంగా చూస్తే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు వారంలో రావాల్సి ఉంది. అధిక వాల్యుయేషన్స్ కారణంగా మార్కెట్‌లో కొన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. విదేశీ పెట్టుబడిదారుల కార్యకలాపాలు, గ్లోబల్ బ్రెంట్ ముడి చమురు ధరలు, డాలర్‌తో రూపాయి హెచ్చుతగ్గులు కూడా మార్కెట్‌కు ముఖ్యమైనవి.

ఈ వారం మార్కెట్ దృష్టి ద్రవ్యోల్బణ డేటాపై ఉంటుందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ఇండియా-యూఎస్ వినియోగదారుల ధరల సూచీ(CPI) ఆధారిత ద్రవ్యోల్బణం డేటా మంగళవారం వస్తుంది. టోకు ధరల సూచీ ఆధారంగా ద్రవ్యోల్బణం గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోలు కార్యకలాపాలు కొనసాగవచ్చని మీనా చెప్పారు. గురువారం టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి.
యూఎస్, చైనా, భారత్ నుంచి ద్రవ్యోల్బణం డేటా పెట్టుబడిదారులకు ప్రపంచ స్థూల ఆర్థిక దృష్టాంతం గురించి సమాచారాన్ని అందిస్తుంని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. అధిక వాల్యుయేషన్ల కారణంగా మార్కెట్ అస్థిరత కొనసాగుతుందని అన్నారు. గతవారం రికార్డు స్థాయి లాభాల మధ్య సెన్సెక్స్ 374.04 పాయింట్లు లాభపడింది.


Click it and Unblock the Notifications