Stock Market: నష్టాల నుంచి తేరుకున్న మార్కెట్లు.. ఆ బ్యాంక్ స్టాక్స్ రాకెట్ దూకుడు..
Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ ప్రతికూలతలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత తేరుకున్నాయి. చివరికి మార్కెట్లు ముగిసే సమయానికి కీలక సూచీలు మాత్రం లాభాల్లో ఉన్నాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 18 పాయింట్ల లాభంలో ప్రయాణాన్ని ముగించింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 318 పాయింట్ల లాభంలో ముగియగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 133 పాయింట్లు నష్టపోయింది.

విదేశీ మదుపరులు పెయింటింగ్ వ్యాపారంలో పోటీ భారీగా పెరుగుతున్నందున ఆ రంగంలోని కంపెనీల్లో తమ పెట్టుబడులను తగ్గించుకుంటున్నాయి. వేదాంత, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, సిప్లాతో పాటు మరిన్ని కంపెనీలు తమ క్యూ-4 ఫలితాలను విడుదల చేయటం మార్కెట్లలో కొంత జోష్ కు కారణంగా నిలిచింది.
ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్ టెల్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, మారుతీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఎన్ఎస్ఈ సూచీలో హిందాల్కొ, బిపిసిఎల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, అదానీ పోర్ట్స్, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, ఎల్ టి, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications