Stock Market: చివరికి తేరుకున్న మార్కెట్లు.. ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..
Closing Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ఇంట్రాడేలో కోలుకుని చివరికి ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 79 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ సైతం 6 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 108 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 66 పాయింట్ల మేర నష్టాలతో వారం మెుదటి రోజు ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా ఓలటాలిటీ అధికంగా ఉండటం దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఐటీ షేర్లు లాభపడగా.. మెటల్ స్టాక్స్ నష్టాల్లోకి జారుకున్నాయి.

ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, ఎల్ టిఐఎమ్, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్, టాటా కన్జూమర్, ఎల్ టి, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, విప్రో, కోటక్ బ్యాంక్, నెస్లే, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్స్, యూపీఎల్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, భారతీ ఎయిర్ టెల్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications