Market Crash: స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. రూ.2.6 లక్షల కోట్ల సంపద ఆవిరి..
Market Crash: సెలవు తర్వాత బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. దీంతో బ్యాంక్స్, ఫైనాన్షియల్స్, టెక్నాలజీ, మెటల్స్ అండ్ ఎనర్జీ స్టాక్స్ నష్టపోయాయి.

మార్కెట్లు ప్రారంభమైన తర్వాత ఇంట్రాడేలో మార్కెట్ సూచీల పతనం కొనసాగటంతో ఇన్వెస్టర్ల సంపద వేగంగా ఆవిరవటం ప్రారంభమైంది. అలా మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 796 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 223 సూచీ పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 539 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 87 పాయింట్ల మేర క్షీణించాయి.

ఈరోజు ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు సూచీలను కిందకు లాగాయి. దీనికి తోడు బ్యాంకింగ్, మెటల్, రియల్టీ రంగాల షేర్లు సూచీలను కిందకు లాగిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. యూఎస్ ఫెడ్ మీటింగ్ నేపథ్యంలో పెట్టుబడిదారులు ఈక్విటీల విక్రయానికి దిగటంతో ఒత్తిడి ఏర్పడింది.
మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాలతో ముగిసి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, బ్రిటానియా, టాటా కన్జూమర్, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజస్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications