US Recession: ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దిగజారిన ఆర్థిక పరిస్థితులు, అధిక ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కోత వంటి సమస్యలు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కరోనాతో చిన్నాభిన్నమైన జీవితాలు కుదుటపడక ముందే మరో బాంబు లాంటి వార్త అందరికీ కునుకు లేకుండా చేస్తోంది.
అవును మళ్లీ మాంద్యం దిశగా యూఎస్ పయనిస్తోందనే చేదు నిజం బయటపడింది. US బిజినెస్ సైకిల్స్ ట్రాక్ చేయడానికి రూపొందించబడిన సూచిక జూన్‌లో వరుసగా 15వ నెలలో కూడా పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది. బలహీనపడుతున్న వినియోగదారుల దృక్పథం, పెరిగిన నిరుద్యోగ క్లెయిమ్‌ల కారణంగా 2007-2009 వరకు తగ్గుదల మాంద్యాన్ని సూచిస్తోందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. భవిష్యత్తు ఆర్థిక కార్యకలాపాను అంచనా వేసే కొలత జూన్‌లో 0.7% క్షీణించి 106.1కి పడిపోయింది.

జూన్ డేటా ప్రకారం రానున్న నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగించడం కొనసాగుతుందని సూచిస్తున్నాయని కాన్ఫరెన్స్ బోర్డ్‌లోని సీనియర్ మేనేజర్ జస్టినా జబిన్స్కా-లా మోనికా తెలిపారు. ప్రస్తుత మూడవ త్రైమాసికం నుంచి 2024 మొదటి త్రైమాసికం వరకు US ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉండవచ్చని కాన్ఫరెన్స్ బోర్డు పునరుద్ఘాటించింది. ఇదే జరిగితే ఇప్పటికే అధ్వానంగా తయారైన పరిస్థితులు మరింతగా దిగజారతాయని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.
విపరీతంగా పెరిగిన ధరలు, కఠినమైన ద్రవ్య విధానం, కష్టతరమైన క్రెడిట్, ప్రభుత్వ వ్యయం తగ్గుదల వంటివి ఆర్థిక వృద్ధిని మరింత తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాయని జబిన్స్కా-లా మోనికా పేర్కొన్నారు. అలాగే జూన్-డిసెంబర్ 2022 మధ్య కాలంలోని 3.8%తో పోలిస్తే LEIలో సంకోచం గత ఆరు నెలల్లో 4.2% పడిపోయిందని కాన్ఫరెన్స్ బోర్డు తెలిపింది.
మెుత్తానికి అమెరికా మాంద్యంలోకి జారుకుంటుందనే భయాలు ఆసియా అంతటా వ్యాపించాయి. పరిస్థితులు చక్కబడతాయని రోజులు గడుపుతున్న సామాన్యులకు మరో సుదీర్ఘ ప్రయాణం తప్పదని తెలుస్తోంది. అంటే వడ్డీ రేట్లు కూడా ఇప్పట్లో తగ్గే అవకాశమే లేదని నిపుణులు నొక్కి చెబుతున్నారు.


Click it and Unblock the Notifications