Market Next Week: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి ర్యాలీనే కొనసాగించాయి. వాస్తవానికి దేశీయ కార్పొరేట్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించటంతో అవి మార్కెట్లను గైడ్ చేశాయి. నాలుగో త్రైమాసికంతో పాటు పూర్తి ఏడాదికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఈవారం భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రధానంగా.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవుట్‌పుట్, బ్యాంకు రుణాల వృద్ధి, డిపాజిట్ వృద్ధి, బ్లూ-చిప్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు దేశీయంగా ప్రభావితం చేయనున్నాయి. ఇదే క్రమంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లపై చేయనున్న ప్రకటనతో పాటు అమెరికాలోని నిరుగ్యోగులు డేటా మార్కెట్లకు మార్గనిర్థేశకంగా నిలవనున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే ఫలితాల సీజన్ మెుదలై కొనసాగుతున్నందున ఇన్వెస్టర్ల దృష్టి ఎక్కువగా కంపెనీల ప్రకటనలపైనే ఉన్నాయి.

ఈ వారం ఫలితాలు విడుదల చేయనున్న కీలక కంపెనీల జాబితాను పరిశీలిస్తే.. టాటా కెమికల్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హావెల్స్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బ్లూ స్టార్, కోల్ ఇండియా, డాబర్ ఇండియా, అదానీ గ్రీన్ ఎనర్జీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, MRF, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ ఐటీ సేవల కంపెనీలు బలహీనమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించటం మార్కెట్లలో కీలకంగా మారింది.
ఇన్వెస్టర్లు వేచి చూస్తున్న ఇతర ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. మే 2న విడుదల కానున్న HSBC మాన్యుఫ్యాక్చరింగ్ PMI ఫైనల్ డేటాపై దృష్టి సారిస్తున్నారు. అలాగే వారు మే 3న విడుదల కానున్న బ్యాంక్ రుణ వృద్ధి, డిపాజిట్ వృద్ధి, విదేశీ మారక ద్రవ్య నిల్వల డేటా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటో కంపెనీలు తమ అమ్మకాల డేటాను కూడా ప్రకటించనున్నాయి. అలాగే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఆర్థిక డేటాపై ట్రేడర్లు దృష్టి సారించాల్సి ఉంటుంది. వీటికి తోడు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తగ్గటం కూడా మార్కెట్లకు సానుకూలంగా మారనుందని బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications