Stock Market: వచ్చేవారం మార్కెట్ల మూడ్ ఇదే.. సూపర్-10 స్టాక్స్.. ఇన్వెస్టర్స్ జర జాగ్రత్త..!
Stock Market: అంబేడ్కర్ జయంతి, వారాంతపు సెలవులు కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడు రోజుల పాటు మూతపడ్డాయి. ఈ క్రమంలో వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండనున్నాయి..? వచ్చే వారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి..? వంటి ఆలోచనలు ఇన్వెస్టర్ల మనసుల్లో మెదులుతున్నాయి. వీటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం దేశంలో చాలా కంపెనీలు తమ నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ప్రధానంగా వచ్చే వారం చాలా కంపెనీలు ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్న తరుణంలో రిజల్ట్స్ వీక్ కీలకంగా మారబోతోంది. ఈ తరుణంలో చాలా మంది చూపు ఐటీ, బ్యాంకింగ్ కంపెనీల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాలు అంచనాలను అందుకోవటంలో విఫలమై మార్కెట్లను నిరాశకు గురిచేశాయి.

దీనికి తోడు అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన మానిటరీ పాలసీ నిర్ణయాలను తీసుకోవటానికి కీలకమైన.. Fed Beige Book విడుదల కానుంది. ఇందులో ప్రాంతీయ బ్యాంకుల నుంచి ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన డేటా ఉంటుంది. ఇది వడ్డీ రేట్ల నిర్ణయానికి కీలకంగా మారనుంది. పైగా ఫెడ్ అధికారులు ద్రవ్య విధానాన్ని నిర్ణయించడానికి పని చేస్తున్నందున ఆ డేటా ఒక ముఖ్యమైన విధాన సాధనంగా ఉండనుంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో ఈ రంగంలో పనిచేస్తున్న కొన్ని కంపెనీల షేర్లు 2023లో పెట్టుబడులకు అనుకూలమని నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా టాటా ఈఎల్ఎక్స్ఐ, బాస్చ్ లిమిటెడ్, కెల్టన్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్, Zensar Technologies, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లిమిటెడ్, Oracle Financial Services Software Ltd, Cyient Ltd, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, Saksoft Ltd, Affle (India) Ltd షేర్లు ఉత్తమైనవని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని గుడ్ రిటర్స్న్ తెలుగు ధృవీకరించటం లేదు. మార్కెట్లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం.


Click it and Unblock the Notifications