GST News: జీఎస్టీ కౌన్సిల్‌లో వాడివేడి నిర్ణయాలు.. అంచనాలకు ఆమడ దూరంలో నిర్మలమ్మ అనౌన్స్‌మెంట్స్
GST council meet: ఒకే దేశం, ఒకే పన్ను విధానం కింద భారత్ వ్యాప్తంగా సింగిల్ ట్యాక్సేషన్ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గతంలోని వివిధ రకాల స్థానిక పన్నుల స్థానంలో GSTని ప్రవేశపెట్టింది. ఆయా ఉత్పత్తులు మరియు సేవలపై పన్నులను సమయానుగుణంగా సవరిస్తూ సామాన్యులకు ఊరట కలిగిస్తోంది. తాజాగా 54వ GST కౌన్సిల్ సమావేశం ముగిసింది. అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వస్తు, సేవల పన్ను (GST) కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎన్నో అంచనాలతో ప్రారంభమైన ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆ శాఖ ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఆరోగ్య బీమా ప్రీమియంలపై GST తగ్గింపు, 2 కంటే ఎక్కువ ఆన్‌లైన్ చెల్లింపులపై పన్ను విధింపు, ఇన్ఫోసిస్ 32 వేల 400 కోట్ల పన్నుకు సంబంధించి కౌన్సిల్ స్పందిస్తుందని అంతా భావించారు.

ఆన్‌లైన్ గేమింగ్ మరియు క్యాసినోలకు GSTని వర్తింపచేసిన తరువాత, ఈ రంగం నుంచి కేంద్రానికి ఆదాయం 412 శాతం పెరిగిందని ఆర్థిక మంత్రి తెలిపారు. విదేశీ విమానయాన సంస్థలకు ఉపశమనం కలిగించేలా అవి భారతదేశంలో దిగుమతి చేసుకునే సేవలకు GST నుంచి మినహాయింపు లభించింది. ఎంపిక చేసిన స్నాక్స్ (నమ్‌కీన్)పై GST రేటు 18 నుంచి 12 శాతానికి తగ్గించబడింది.
వైద్య బీమా ప్రీమియంపై పన్ను కోతకు సంబంధించి కొత్త GoMను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అందుకే దీనిపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. క్యాన్సర్ ఔషధాలపై పన్ను రేటును 12 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. B2Cలో GST బిల్లింగ్‌ను ప్రవేశపెట్టాలని భావించగా అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. దీని ద్వారా రిటైల్ మార్కెట్‌లో పన్ను వసూళ్లు మెరుగుపడతాయని అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ సంస్థలచే స్థాపించబడిన విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనా కేంద్రాలకు అందుతున్న నిధులు GST నుంచి మినహాయించబడ్డాయి. అంటే ఇకమీదట GST లేకుండానే ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థల నుంచి పరిశోధనల కోసం విరాళాలను స్వీకరించే సౌలభ్యం లభిస్తోంది. సెస్ సేకరణపైనా GoM ఏర్పాటు చేయనున్నారు.


Click it and Unblock the Notifications