Stock Market: నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.. డ్రాగ్ చేసిన రియల్టీ స్టాక్స్..
Closing Bell: కొత్త వారం మెుదటి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో ఫార్మా రంగంలోని కంపెనీలు లాభాలను నమోదు చేయగా.. రియల్టీ స్టాక్స్ నష్టాలతో సూచీలను కిందకు లాగాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 169 పాయింట్ల నష్టంతో నేడు ప్రయాణం ముగించగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 45 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 281 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 89 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని ముగించింది. దీంతో కీలక బెంచ్ మార్క్ సూచీలు మూడు రోజుల వరుస లాభాల ర్యాలీకి నేడు బ్రేక్ వేశాయి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, హిందాల్కొ, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, టైటాన్, దివీస్ ల్యాబ్, ఐషర్ మోటార్స్, మారుతీ, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, ఐటీసీ, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా కన్జూమర్, ఓఎన్జీసీ, యూపీఎల్, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు ముగిశాయి.


Click it and Unblock the Notifications