Closing Bell: ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి లాభదాయకంగానే ప్రయాణాన్ని ముగించాయి. బ్యాంకింగ్ స్టాక్స్ ఒడిదొడుకులను కొనసాగించినప్పటికీ.. మార్కెట్ల ముగింపు నాటికి ఎఫ్ఎంసీజీ, రియల్టీ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు ఉత్తమ పనితీరును కనబరిచాయి.
మార్కెట్లు ముగింపు నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 268 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 69 పాయింట్ల మేర లాభంతో ప్రయాణాన్ని ముగించింది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం మార్కెట్లలోని అమ్మకాల ఒత్తిడికి చిత్తై 266 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 90 పాయింట్లు గెయిన్ అయ్యింది. నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు నేడు ఉదయం లాభాలను పొడిగించాయి. అయితే US FOMC మినిట్స్ విడుదలకు ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండటంతో మార్కెట్లలో ర్యాలీ పరిమితం చేయబడింది.

ఎన్ఎస్ఈలో సిప్లా, టాటా కన్జూమర్, హిందుస్థాన్ యూనీలివర్, కోల్ ఇండియా, రిలయన్స్, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, దివీస్ ల్యాబ్, ఎల్ టిఐఎమ్, ఎల్ టి, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, మారుతీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి
ఇదే క్రమంలో శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కొ, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా స్టీల్, బీపీసీఎల్, గ్రాసిమ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు నష్టాలతో నేడు టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications