Viral News: రైతు అనే పదం గుర్తుకు వచ్చినప్పుడల్లా రాత్రింబగళ్లు కష్టపడి జీవనోపాధి పొందే మనుషులు మెదులుతారు. పంట చేతికొచ్చేంత వరకు పసిపిల్లల్లా దానిని సంరక్షిస్తుంటారు. దానిని మంచి ధరకు విక్రయించే వరకు ఆందోళన చెందుతుంటారు.
కానీ ఇప్పుడు కాలం మారుతోంది. ఒకపక్క నష్టాలతో చావే శరణ్యం అనుకుంటున్న రైతులు ఉన్నప్పటికీ.. కొందరు యువ రైతులు మాత్రం నూతన ప్రయత్నాలతో లాభాల బాట పడుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను సైతం వదిలి రైతులుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఒక యువరైతు కూరగాయలు అమ్మేందుకు ఆడి ఏ4 సెడాన్‌లో వచ్చిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో కేరళ యూత్ ఐకాన్ అవార్డు గ్రహీత, రైతు మరియు యూట్యూబర్ సుజిత్‌దిగా తెలిసింది. 'వెరైటీ ఫార్మర్' పేజీలో సుజిత్ ఈ వీడియోను పెంచుకున్నాడు.

బచ్చలికూర పండించే ప్రదేశం నుంచి ప్రారంభించి.. తన ఆడి కారులో రోడ్డు కూడలికి చేరుకున్న వీడియో ఇందులో ఉంది. ఆటోలో ఆకుకూరలు తెచ్చిన తర్వాత.. రోడ్డుకిరువైపులా ప్లాస్టిక్ షీట్ వేసి దానిపై ఆకుకూరలను పరిచాడు. కూరగాయలన్నీ అమ్మిన వెంటనే సుజీత్ కారు ఎక్కడంతో ఈ వీడియో ముగుస్తుంది. 10 ఏళ్లకు పైగా వ్యవసాయ రంగంలో సుజిత్ చేస్తున్న కృషికి అక్కడి ప్రభుత్వం ఎన్నో అవార్డులను సైతం అందించింది. దళారులు లేకుండా చిన్న మెుత్తంలో అనేక రకాల పంటలను పండించి విక్రయిస్తూ విజయం సాధించాడు.
తన వ్యవసాయాన్ని మరింత ప్రాచుర్యం చేసేందుకు యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచి వాటి ద్వారా చాలా మందికి చేరువయ్యాడు. సుజిత్ ఇటీవలే ఆడి ఏ4 సెడాన్ కారును కొనుగోలు చేశాడు. అయితే లగ్జరీ కారును సొంతం చేసుకున్న మొదటి రైతు సుజిత్ కాదు. కొన్నేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన ఓ రైతు సరికొత్త మెర్సిడెస్ బెంజ్ బి క్లాస్ ఎమ్‌పివిని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. 2018లో రైతు మెర్సిడెస్ కారు కొనాలనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు.


Click it and Unblock the Notifications