NASA: అంతరిక్షంలోకి 3వ భారతీయ మహిళ..కేరళ అమ్మాయికి సూపర్ అవకాశం..

NASA: నాసాలో పనిచేయడం భారతీయులకే కాదు ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధకులకు పెద్ద కల. ఆ విధంగా భారత్‌కు చెందిన ఆదిరా అనే యువతికి ఇప్పుడు నాసాలో పనిచేసే అవకాశాన్ని దక్కించుకుంది. భారత్ కు చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన మూడో భారతీయ మహిళగా ఈమె త్వరలోనే రికార్డు సృష్టించనున్నారు.

అతిరా ప్రీతా రాణి..

అతిరా ప్రీతా రాణి..

కేరళకు చెందిన అతిరా ప్రీతా రాణికి స్కూల్‌లో చదువుతున్నప్పుడే వ్యోమగామి కావాలనే ఆసక్తి ఉండేది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన తరగతులకు ఆమె హాజరయ్యారు. అంతరిక్షం గురించి పరిజ్ఞానాన్ని ఆమె రోజురోజుకూ విస్తరించుకున్నారు.

కెనడాలో విద్య..

కెనడాలో విద్య..

చదువుకుంటూ కుటుంబానికి భారం కాకుండా పనిచేసిన అతిరా ప్రీత రాణి చిన్న వయసులోనే కెనడాలోని ఒట్టావాలో కాలేజీలో చేరింది. పైలట్ కావాలనే మరో కలలుగన్న అతిర.. పైలట్ కావాలంటే ఎయిర్ ఫోర్స్‌లో చేరాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఏరోస్పేస్ చదువు కోసం డబ్బును ఆదా చేసింది.

పెళ్లి తరువాత భర్త సహకారంతో..

పెళ్లి తరువాత భర్త సహకారంతో..

ఏరోస్పేస్ చదువులో మంచి మార్కులతో పూర్తిచేయగానే అతిరకు పెళ్లయింది. అతిరా అంతరిక్ష కలకు ఆమె భర్త కూడా సపోర్ట్‌గా నిలిచాడు. అలా అంతరిక్ష పరిశోధనలపై అతిరా కలలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ దశలో తన భర్తతో కలిసి ఎక్సో జియో ఏరోస్పేస్ అనే సంస్థను కూడా ప్రారంభించింది. పలు వ్యోమగామి శిక్షణా కార్యక్రమాలపై పరిశోధనలు చేసింది.

నాసాలో పనిచేసేందుకు..

నాసాలో పనిచేసేందుకు..

అప్పుడే ఇంటర్నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ(NASA) నిర్వహిస్తున్న వ్యోమగామి శిక్షణ కార్యక్రమం గురించి తెలిసింది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని నాసా నిర్వహించడంతో.. అందులో చేరి వివిధ దశలను దాటుకుని ఇప్పుడు నాసాలో పనిచేసే అవకాశాన్ని దక్కించుకుంది.

3వ భారతీయ మహిళ..

3వ భారతీయ మహిళ..

చంద్రుడిపై ఉన్న వ్యోమగాములను రక్షించేందుకు నాసా చేస్తున్న ప్రయోగంలో ప్రస్తుతం అతిరా కూడా ఒకరు కావడం గమనార్హం. తగిన శిక్షణ పూర్తి చేసుకుని అంతరిక్షంలోకి వెళ్లనున్న ఆదిరా.. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి వెళుతున్న మూడో భారతీయ మహిళగా నిలిచారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+