మొదటిసారిగా, కేరళకు చెందిన మహిళా స్టార్టప్ ఐక్యరాజ్యసమితి మహిళా సాధికారత సూత్రాల కోసం ఒప్పందం కుదుర్చుకున్న భారతదేశానికి చెందిన 170 కంపెనీలలో ఒకటిగా ఉంది. ఐక్యరాజ్యసమితి మహిళా సాధికారత సూత్రాలను అమలు చేయడానికి కేరళ ఇప్పటికే నీతి ఆయోగ్ జాబితాలో ఉంది. ఇప్పుడు మహిళా సాధికారత సూత్రాల కోసం ఒప్పందంపై తిరువనంతపురానికి చెందిన వైద్యుతి ఎనర్జీ సర్వీసెస్ (వీఇఎస్) సంతకం చేసింది.

ఐక్యరాజ్యసమితి మహిళా సాధికారత సూత్రాల కోసం సంతకం చేసిన వైద్యుతి ఎనర్జీ సర్వీసెస్
ఐక్యరాజ్యసమితి మహిళా సాధికారత సూత్రాల కోసం సంతకం చేసిన భారతదేశానికి చెందిన 170 కంపెనీలలో ఇప్పటివరకు 64 కంపెనీలు ప్రైవేటు రంగానికి చెందినవని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. వైద్యుతి ఎనర్జీ సర్వీసెస్ భారతదేశం నుండి 65 వ సంస్థ మరియు కేరళ నుండి ఐక్యరాజ్యసమితి తో ఇటువంటి ఒప్పందం కుదుర్చుకున్న మొదటి సంస్థ అని సంస్థ పేర్కొంది. మహిళా సాధికారత సూత్రాలు మహిళల విషయంలో కార్యాలయంలో, బయట సమాజంలో, మార్కెట్లో మహిళలను ఎలా శక్తివంతం చేయాలనే దానిపై ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయి.

మహిళా సాధికారత సూత్రాల అమలులో కీలకంగా వైద్యుతి
ఒప్పందంపై సంతకం చేయడంతో, వైద్యుతి ఎనర్జీ సర్వీసెస్ సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం కోసం ఉన్నత స్థాయి కార్పొరేట్ నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, స్త్రీ పురుషులకు పనిలో న్యాయంగా వ్యవహరిస్తుందని , మానవ హక్కులు మరియు వివక్షత లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తుందని సంస్థ పేర్కొంది. అంతేకాదు మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కావాల్సిన మద్దతు ఇస్తుంది. మహిళల ఆరోగ్యం, భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారిస్తుంది . మహిళా సాధికారత కోసం కావలసిన అన్ని చర్యలు చేపడుతూనే వారిలో విద్యనూ ప్రోత్సహిస్తుంది.

వైద్యుతి ఆరంభం నుండి మహిళలకే ప్రాధాన్యత
పునరుత్పాదక ఇంధన రంగంలో అపార అనుభవం ఉన్న మరియు గల్ఫ్ సహా వివిధ దేశాలలో బహుళజాతి ప్రాజెక్టులలో పాలుపంచుకున్న అనూప్ బాబు అనే ఎన్ఆర్ఐ చేత వైద్యుతి ఎనర్జీ సర్వీసెస్ స్థాపించబడింది.వివిధ సంవత్సరాల పరిశోధనల తరువాత, అనూప్ బాబు తన కలల ప్రాజెక్టును ప్రారంభించాడు .ఈ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న అతని తల్లి ఇందిరా బాబును మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు.ఇంధన-సమర్థవంతమైన డ్రైవర్లను గుర్తించడంలో , ఆచరణీయ కార్యాచరణ ప్రణాళికలను అనుసరించడంలో ఈ సంస్థ సహాయపడుతుంది.

కీలక పోస్ట్ లు అన్నీ మహిళలే నిర్వహించే సంస్థ వైద్యుతి
కన్సల్టెన్సీ-కమ్-ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సంస్థ, వైద్యుతి ఎనర్జీ సర్వీసెస్ మహిళల సాధికారతను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంస్థలో అన్ని కీలక పదవులు మహిళలచే నిర్వహించబడుతున్నాయి. కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు శక్తి సామర్థ్య విభాగంలో రిటైర్డ్ ఇంజనీర్ అయిన సుధా కుమారి వైద్యుతి యొక్క యొక్క వ్యాపార అధిపతి.ఆపరేషన్స్ హెడ్ కోకిలా విజయకుమార్, ఇంధన రంగంలో అపారమైన పరిజ్ఞానం ఉన్న వాణీ విజయ్ కూడా కీలక పదవులను నిర్వహిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపింది.

గ్రీన్ ఎనర్జీలో సర్టిఫైడ్ సాంకేతిక శిక్షణను అందించే మొదటి గుర్తింపు పొందిన సంస్థ
ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక శక్తి, శక్తి నాణ్యత అంచనా, ఇ-మొబిలిటీ, వాతావరణ మార్పు, శక్తి ఆడిట్, ప్రాజెక్ట్ నిర్వహణ మరియు కార్బన్ అకౌంటింగ్ రంగాలలో కన్సల్టింగ్, శిక్షణ, ఆర్ అండ్ డిలను వైద్యుతి ఎనర్జీ సర్వీసెస్ నిర్వహిస్తుంది . కేరళ రాష్ట్రంలో ఢిల్లీకి చెందిన సిఐఐ-ఐటిసి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సహకారంతో గ్రీన్ ఎనర్జీలో సర్టిఫైడ్ సాంకేతిక శిక్షణను అందించే మొట్టమొదట గుర్తింపు పొందిన సంస్థ ఇదే కావడం విశేషం. వైద్యుతి ఇప్పటివరకు వివిధ పాఠశాలలు మరియు ఇంజనీరింగ్ కళాశాలలకు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో సాంకేతిక సహకారం అందించింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో 'కేరళ మోడల్' ను స్థాపించడమే వైద్యుతి ఎనర్జీస్ లక్ష్యం. ఇప్పుడు ఐక్యరాజ్యసమితితో ఈ సంస్థ ఒప్పందం చేసుకోవటం నిజంగా విశేషం
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications