iPhone 14 Pro: ఐఫోన్ పిచ్చితో దుబాయ్ ప్రయాణం.. రూ.40వేలు ఖర్చు చేసినప్పటికీ.. అసలేమైందంటే..
iPhone 14 Pro: ఆపిల్ కంపెనీ ఉత్పత్తులను వినియోగించేవారికి అవంటే ఎంత పిచ్చో మనందరికీ తెలుసు. అందులోనూ ఐఫోన్ వినియోగదారుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాంచ్ కాగానే వాటిని దక్కించుకోవాలని చేయని ప్రయత్నాలు ఉంవంటే నమ్మండి. తాజాగా కేరళకు చెందిన ఒక వ్యక్తి చేసిన పని గురించి తెలిస్తే మీకు కచ్చితంగా మతి పోతుంది. అవును అసలు అతను ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

కేరళ వ్యాపారి..
కేరళలోని కొచ్చికి చెందిన వ్యాపారి ధీరజ్ పల్లియిల్ ఐఫోన్ 14 ప్రోని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా దానికోసం ప్రత్యేకంగా సెప్టెంబర్ 15న దుబాయ్‌కి వెళ్లాడు. మన దేశంలోకి ఈ కొత్త ఐఫోన్ శ్రేణి అందుబాటులోకి రావడానికి ఒక రోజు ముందు అతను ఈ పని చేశాడు.

ఎక్కడ కొన్నాడంటే..
ధీరజ్ పల్లియిల్ దుబాయ్‌లోని అత్యంత ప్రసిద్ధ షాపింగ్ గమ్యస్థానాల్లో ఒకటైన మిర్డిఫ్ సిటీ సెంటర్ నుంచి ఐఫోన్ కొనుగోలు చేశాడు. ఐఫోన్ 14 ప్రో ప్రారంభ ధర రూ.1,29,900గా ఉంది. అయితే దీనిని కొనటానికి టిక్కెట్లు, వీసా రుసుములకోసం అతను ఏకంగా రూ.40 వేలు ఖర్చు చేయటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంటే ఫోన్ ధరలో దాదాపు మూడో ఒంతు ప్రయాణ ఛార్జీలకే ఖర్చుచేశాడు ఈ కేరళ ఐఫోన్ ప్రియుడు.

గతంలోనూ..
వ్యాపారవేత్త విలువైన గాడ్జెట్‌ను కొనుగోలు చేయడానికి విదేశాలకు వెళ్లడం ఇదే మొదటిసారి కాదని తెలుస్తోంది. ఇంతకు ముందు 2017లో iPhone 8 కొనుగోలు కోసం దుబాయ్‌కి వెళ్లాడు. తర్వాత కూడా ఇలాంటి పర్యటనలు అతడు చేశాడు. అలా 2019లో దుబాయ్‌లో ఐఫోన్ 11 ప్రో మాక్స్‌ను మొదట మిర్డిఫ్ సిటీ సెంటర్ నుంచి కొనుగోలు చేశాడు. ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 13 విక్రయాలు దుబాయ్‌లో ప్రారంభమైనప్పుడు నేను మొదటి కస్టమర్ నని అతడు తెలిపాడు.

అతని వ్యాపారం..
డేర్ పిక్చర్స్ అనే డిజిటల్ కన్సల్టెన్సీకి పల్లియిల్ డైరెక్టర్ గా ఉన్నాడు. మన దేశంలో ఐఫోన్ 14 సిరీస్ ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 128GB బేస్ వేరియంట్ కోసం iPhone 14 ధర రూ.79,900. 256GB, 512GB మోడల్‌ల ధర వరుసగా రూ.89,900, రూ. 1,09,900గా ఉన్నాయి.

ఇతర మోడళ్ల ధరలు..
ఐఫోన్ ప్రో మోడల్ బేస్ వేరియంట్ ధర రూ.1,29,900. 256GB ధర రూ.1,39,900, 512GB ధర రూ.1,59,900, 1TB వెర్షన్‌ల ధర రూ.1,79,900గా ఉంది. ఐఫోన్ ప్రో మ్యాక్స్ వివిధ మోడళ్ల ధరలు రూ.1,39,900 నుంచి రూ.1,89,900 వరకు ఉన్నాయి.


Click it and Unblock the Notifications