Kerala Lottery: దేవుడు కరుణిస్తే అదృష్టం పట్టడం ఎంతసేపు. అలా రాత్రికిరాత్రే కోటీశ్వరులను కూడా అయిపోవచ్చని తాజాగా కేరళలో జరిగిన సంఘటన దీనినే రుజువు చేస్తోంది.
వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తికి ఏకంగా కోటి రూపాయల లాటరీ తగిలింది. ఇందులోనే అసలు గమ్మత్తు అంతా ఉంది. ఎన్‌కే గంగాధరన్ అనే వ్యక్తి ఒక లాటరీ ఏజెంట్. అతని వద్ద అమ్ముడుపోని కొన్ని లాటరీల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 5050 నంబరును విజేతగా ప్రకటించటంతో తలరాత మెుత్తంగా మారిపోయింది. దీంతో అతడు ప్రస్తుతం కోటి రూపాయలు గెలుచుకున్నాడు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాటరీ అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ.. కేరళలో మాత్రం ఎక్కువగా ప్రజలు లాటరీల కొనుగోలు చేస్తుంటారు.

మెుదటగా తనకు లాటరీ వచ్చిందంటూ బిగ్ టికెట్ నుంచి కాల్ వచ్చిందని తనతో ఎవరో ప్రాంక్ చేస్తున్నారని, కావాలనే తాను గెలిచినప్పుడు అబద్ధం చెబుతున్నట్లు భావించినట్లు ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ తర్వాత తనకు వివిధ నంబర్ల నుంచి కాల్స్ వచ్చినట్లు గంగాధరన్ తెలిపాడు.
కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి చెందిన గంగాధరన్ లాటరీ ఏజెంట్ కావడంతో, తన లాటరీ టిక్కెట్ దొంగిలించబడుతుందనే భయంతో, ఎవరికీ తెలియజేయకుండా విషయం బయటకు చెప్పకుండా పని పూర్తి చేశాడు. 33 ఏళ్లుగా అతను బస్ కండక్టర్‌గా పనిచేశాడు. అలా నాలుగేళ్ల కిందట లాటరీ దుకాణాన్ని తెరిచాడు. ఇతని వద్ద లాటరీలు కొన్న ఆరుగురికి రూ.5 చొప్పున లాటరీ తగిలింది. అలాగే కొన్ని వారాల కింద ఓనం పండుగ సందర్భంగా విక్రయించిన తిరువోణం బంపర్ లాటరీలో కోయంబత్తూర్ జిల్లా అన్నూర్‌కు చెందిన నటరాజన్ మొదటి బహుమతిగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు.
అలాగే ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి అబుదాబిలోని ప్రముఖ బిగ్ టికెట్ డ్రాలో సుమారు రూ.44 కోట్ల విలువైన 20 మిలియన్ దిర్హామ్‌ల బహుమతిని గెలుచుకున్నాడు. ఇలా అదృష్టం కలిసొచ్చిన అనేక మంది కోటీశ్వరులుగా మారిపోయారు. ఇదే క్రమంలో ఎప్పటికైనా లాటరీ తగలబోతుందా అంటూ దండయాత్ర కొనసాగిస్తూ ఎక్కువ పెట్టుబడి పెట్టే వారు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. లక్షల్లో ఒకరు మాత్రమే లాటరీలో విజయం ద్వారా పెద్ద మెుత్తాన్ని పొందుతుంటారు.


Click it and Unblock the Notifications