Kerala policy: పక్కా ప్లాన్‌తో కేరళ కొత్త పాలసీ.. యువతకు ఇక జాబ్స్ జాతరే..!
Kerala policy: యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎదురుదెబ్బ తగులుతోంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ కొలువుల కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ చేయకుండా కాలం గడపుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించేందుకు సైతం చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది.
కేరళలో విస్తరించిన IT మరియు BPO యూనిట్లకు ప్రభుత్వం మూలధన రాయితీలను అందజేసేందుకు ఓ పాలసీని తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన IT పాలసీ-2023 ముసాయిదా ప్రకారం.. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రైవేట్ ల్యాండ్ డెవలపర్లు, ఇన్వెస్టర్లకు ప్రోత్సాహకాలు అందించేందుకు ముందుకొచ్చింది.

స్థానికులకు 50 శాతం ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమైంది. వంద నుంచి వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టి, కనీసం వెయ్యి నుంచి 5 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే సంస్థలకు ఈ పాలసీ వర్తింపచేయాలని భావిస్తోంది. పలువురు వాటాదారుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న అనంతరం ఫైనల్ పాలసీ ఖరారు చేయబడుతుందని కేరళ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి రథన్ యు కేల్కర్ తెలిపారు.
ఇవేకాక 25 శాతం వరకు SGST రీయింబర్స్‌మెంట్, విద్యుత్ టారిఫ్ పొడిగింపులు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు, రిజిస్ట్రేషన్ ఛార్జీల మాఫీ మరియు మహిళలకు ఉపాధి కల్పించే యూనిట్లకు ప్రోత్సాహకాలు, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలలో తగ్గింపులు, నాణ్యత ధృవీకరణ ప్రోత్సాహకాలు, గ్రీన్ క్యాంపస్ కార్యక్రమాలు, 5G మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక రాయితీలు వంటి ఇతర ప్రోత్సాహకాలను సైతం అందించేందుకు సిద్ధమైంది.


Click it and Unblock the Notifications