Mutual Funds: ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరియు లాభదాయకతకు అనువైన పరిస్థితులతో "గోల్డిలాక్స్ కాలం"లోకి ప్రవేశిస్తోందని ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన కెన్నెత్ ఆండ్రేడ్ ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలో పెట్టుబడులకు అనుకూలమైన రంగాల గురించి ఆయన ప్రస్థావించారు.
ఆయన తన నివేదికలో జాగ్రత్తగా ఉండాల్సిన రంగాలతో పాటు భవిష్యత్తులో రాబడిని అందించగల రంగాలపై ఆశావాద దృక్పథాన్ని అందించారు. అయితే ప్రస్తుతం మార్కెట్లు జీవితకాల అత్యధిక గరిష్ఠాల వద్ద ట్రేడ్ అవుతున్న సమయంలో చాలా మంది ఇన్వెస్టర్లు వేటిలో ఇన్వెస్ట్ చేయాలి లేదా ఏఏ రంగాల పరిస్థితి ఎలా ఉండనుందనే విషయాలకు నివేదికలో సమాధానాలు ఉన్నాయి. ఆకర్షణీయమైన వాల్యుయేషన్‌ల వద్ద పెట్టుబడి పెట్టే అవకాశాల కోసం ఓపికగా ఉండటం అవసరమని ఆండ్రేడ్ చెప్పారు.

ఆండ్రేడ్ ప్రకారం మౌలిక సదుపాయాలు, ఐటీ, కెమికల్స్ అండ్ రియల్ ఎస్టేట్‌లోని ఎంపిక చేసిన విభాగాలు ఆసక్తి ఉన్న రంగాలుగా హైలైట్ చేయబడ్డాయి. ప్రస్తుతం మార్కెట్లో కార్పొరేట్ కంపెనీలు బలమైన లాభాలతో తమ క్యూ1 ఫలితాలను ప్రకటించటం దేశ ఆర్థిక వ్యవస్థ అనుకూలమైన పరిస్థితులకు అద్ధంపడుతోందని అన్నారు. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్ సంస్థ ఇన్వెస్టర్లను తమ ప్రస్తుత పోర్ట్ ఫోలియోలకు పరిమితం కావాలని చెబుతోంది. ప్రస్తుత మార్కెట్ల ర్యాలీలో అండర్ వ్యాల్యూడ్ రంగాలను కనుగొనటం కష్టతరంగా మారినందున రానున్న ఏడాది నుంచి రెండేళ్ల కాలంలో పెట్టుబడికి సానుకూల అవకాశాలు దొరుకుతాయని పేర్కొంది.
ప్రస్తుతం దేశంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, ఆటోమోటివ్‌తో సహా వివిధ పరిశ్రమలు తమ సామర్థ్యాలలను పెంచుకునేందుకు చురుకుగా పెట్టుబడి పెట్టడంతో బలమైన ప్రైవేట్ క్యాపెక్స్ సైకిల్ ఉందని మ్యూచువల్ సంస్థ తెలిపింది. దీనికి తోడు దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ వ్యయం పెరిగిందని పేర్కొంది. అలాగే పవర్ సెక్టార్ సైతం గణనీయమైన క్యాపెక్స్‌ను చూస్తోందని పేర్కొంది. రియల్టీ రంగంలో బూమ్ కొనసాగుతున్నందున అనుబంద రంగాలైన స్టీల్, సిమెంట్, పెయింట్స్, ఎలక్ట్రికల్స్ వంటి ఇతర రంగాలు లాభపడుతున్నాయని పేర్కొంది.
దీనికి తోడు ముఖ్యంగా దేశంలో చాలా కాలం తర్వాత ఐటీ రంగం తిరిగి పునరుద్ధరణను చూడటం సానుకూల అంశంగా మ్యూచువల్ ఫండ్ చూస్తోంది. ఇటీవల ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ బలమైన క్యూ1 ఫలితాలు ఐటీ రంగం తిరిగి గాడిన పడుతుందనే బలమైన సంకేతాలను మార్కెట్లను అందించింది. ఇది ఐటీ కంపెనీలు సమీప భవిష్యత్తులో వృద్ధిని పెంచే ఆర్డర్‌ల బలమైన పైప్‌లైన్‌ను కలిగి ఉండటాన్ని ఎత్తి చూపింది. ఈ తరుణంలో ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్‌ఫ్రా, ఐటీ రంగాలను ఇష్టపడుతోందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications