Multibagger Stock: స్టాక్ మార్కెట్ అనే సముద్రంలో కొన్ని మల్టీబ్యాగర్ ముత్యాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అయితే సమయాన్ని వెచ్చించి షేర్ల ఫండమెంటల్స్, వాటి వ్యాపార ధోరణి గురించి అర్థం చేసుకుని ఎంపిక చేసుకోవటం చాలా ముఖ్యం. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టిన వారు ఇప్పుడు రెట్టింపు ఆదాయాలను పొందుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది KEI Industries కంపెనీ షేర్ల గురించే. మూడేళ్ల కాలంలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు ఏకంగా 577 శాతం రాబడిని అందించింది. అలాగే గడచిన 12 నెలల్లో 58 శాతానికి పైగా రిటర్న్స్ అందించగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 30 శాతం రాబడితో దూసుకుపోతోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.17,091 కోట్లుగా ఉంది.

వివరాల్లోకి వెళితే కేఈఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక్కో షేరు ధర ఏప్రిల్ 24, 2020న రూ.280 వద్ద ఉంది. అయితే తాజాగా 28 ఏప్రిల్ 2023న మార్కెట్ ముగిసే సమయానికి షేర్ విలువ రూ.1,893గా ఉంది. అంటే మూడేళ్ల కిందట ఎవరైనా ఇన్వెస్టర్ లక్ష రూపాయలు కంపెనీ షేర్లలో పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ రూ.6.73 లక్షలుగా ఉండేది. ప్రస్తుతం షేర్ ధర గరిష్ఠాలకు చేరువలో ట్రేడవుతోంది.
షేర్ హోల్డింగ్ ప్యాట్రన్ గమనిస్తే మెుత్తం 8 మంది డైరెక్టర్లు కంపెనీలో 37.21 శాతం వాటాలను కలిగి ఉన్నారు. అలాగే మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ కంపెనీలో 62.79 శాతంగా ఉంది. మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరపు వార్షిక ఆదాయాన్ని గమనిస్తే సంస్థ లాభం 39.50% పెరిగి రూ.376.5 కోట్లకు చేరుకుంది.
ఈ కంపెనీ 1968లో ప్రారంభించబడింది. KEI ఇండస్ట్రీస్ వైర్లు & కేబుల్స్ తయారీ వ్యాపారంలో ఉంది. కంపెనీ అదనపు హై వోల్టేజ్ కేబుల్స్, హై వోల్టేజ్ కేబుల్స్, తక్కువ వోల్టేజ్ కేబుల్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ కేబుల్స్, కంట్రోల్ కేబుల్స్, సోలార్ కేబుల్స్, హౌస్ వైర్లు, సింగిల్ కోర్/మల్టీకోర్ ఫ్లెక్సిబుల్ కేబుల్స్, థర్మోకపుల్ ఎక్స్‌టెన్షన్/కంపెన్సేటింగ్ కేబుల్స్, రబ్బర్ కేబుల్స్, ఫైర్ సర్వైవల్/రెసిస్టెంట్, మెరైన్ & ఆఫ్‌షోర్ కేబుల్స్, వైండింగ్ వైర్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ వైర్లు వంటి అనేక ఎలక్ట్రిక్ ఉత్పత్తులను తయారు చేస్తోంది.


Click it and Unblock the Notifications