For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం కొంటున్నారా.. రశీదులు జాగ్రత్త! ఐటీ రిటర్నులకు అవే ఆధారం!

|

బంగారం అంటే ఆడవాళ్లకు ఎంతో మోజు. పండుగలు, ఇతరత్రా శుభకార్యాల సమయంలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. కానీ చాలామందికి నగలపై ఉన్నంత శ్రద్ధ అవి కొన్న సమయంలో దుకాణదారులు ఇచ్చిన రశీదుల పట్ల ఉండదు. వాటిని ఎక్కడో పడేస్తూ ఉంటారు.

ఇప్పటి వరకు ఏమోకానీ.. ఇక నుంచి మాత్రం ఈ నిర్లక్ష్యం కూడదు. బంగారం కొన్నప్పుడు దుకాణదారులు ఇచ్చిన రశీదులు అత్యంత జాగ్రత్తగా భద్రపరచాల్సిందే. ఎందుకంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ చేసేటప్పుడు ఎక్కడ నుంచి ఎంత మొత్తంలో బంగారం కొన్నారో చూపించడానికి ఈ రశీదులే ఆధారంగా పనిచేస్తాయి.

అసలెంత బంగారం ఉంటే సేఫ్?

అసలెంత బంగారం ఉంటే సేఫ్?

అవివాహిత.. అంటే పెళ్లికాని యువతి వద్ద 250 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు ఉండొచ్చు. వివాహిత.. అంటే పెళ్లి అయిన మహిళ వద్ద 500 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు ఉండవచ్చు. ఇక పురుషుల విషయానికొస్తే.. వారి వద్ద 100 గ్రాముల వరకు మాత్రమే బంగారు ఆభరణాలు ఉండాలి. ఇలాంటప్పుడు ఏ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి వారిని ప్రశ్నించడు.

ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే?

ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే?

ఉండొచ్చు.. ఈ లెక్కకు మించి మీ వద్ద బంగారు ఆభరణాలు ఉన్నట్లుగాని, మీ కుటుంబ సభ్యులవి కాక మరెవరివైనా ఆభరణాలు మీ వద్ద ఉన్నట్లుగాని ట్యాక్స్ అధికారులు గుర్తిస్తే మాత్రం అవి ఎక్కడ్నించి వచ్చాయో, ఎలా వచ్చాయో వివరించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ బంగారు ఆభరణాలను ట్యాక్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. ‘‘ఎందుకంటే బంగారం అనేది మూలధన ఆస్తి(క్యాపిటల్ అసెట్). పన్ను చెల్లింపుదారులు ఎలాంటి మూలధన లాభాలు ఆర్జించినా.. దానిపై పన్ను అనేది తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది..'' అని ట్యాక్స్ స్కానర్.కామ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సుధీర్ కౌషిక్ చెబుతున్నారు.

లెక్క చెప్పగలిగితే, ఎంత బంగారం ఉన్నా ఓకే...

లెక్క చెప్పగలిగితే, ఎంత బంగారం ఉన్నా ఓకే...

అయితే 2016లో విడుదలైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) సర్క్యూలర్ ప్రకారం.. వ్యక్తుల దగ్గర ఎంత బంగారమైనా ఉండొచ్చు, పరిమితులేమీ లేవు. మీరు కొనుగోలు చేసినా సరే, లేకపోతే ఆ బంగారం మీకు వారసత్వంగా వచ్చినా సరే. కానీ ట్యాక్స్ స్క్రూటినీ సమయంలో మాత్రం ఆ బంగారం ఎక్కడ్నించి, ఎలా వచ్చిందో వివరించాల్సి ఉంటుంది. మీరు కొన్న బంగారమైతే దానికి సంబంధించిన రశీదులు చూపించాల్సి ఉంటుంది. అలాగే ఆ బంగారం కొనడానికి డబ్బు ఎక్కడ్నించి వచ్చిందో వివరించాలి. ‘‘వారసత్వంగా వచ్చిన బంగారానికైతే ఒరిజినల్ కొనుగోలుదారు ఆ బంగారానికి ఎంత చెల్లించారో తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ దాన్ని కొన్న సమయంలో దాని ధర ఎంత ఉందో తెలియని పక్షంలో.. 2001 ఏప్రిల్ 1న మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే ఆ ధరను లెక్కించాలి..'' అని క్లియర్ ట్యాక్స్ సీఈవో అండ్ ఫౌండర్ అర్చిత్ గుప్తా పేర్కొన్నారు.

మీ ఆదాయం రూ.50 లక్షలు మించి ఉంటే...

మీ ఆదాయం రూ.50 లక్షలు మించి ఉంటే...

మీ ఆదాయం రూ.50 లక్షలు మించి ఉంటే, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కచ్చితంగా మీ దగ్గర ఉన్న గోల్డ్ హోల్డింగ్ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఆభరణాలు కూడా ఇందులో భాగమే. ఒకవేళ మీరు దేశం వెలుపల అంటే.. విదేశాల్లో బంగారం కొన్నట్లయితే ఈ బంగారాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌లోని ఫారిన్ అసెట్ షెడ్యూల్‌‌లో కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. మూడేళ్ల కంటే తక్కువ కాలం నుంచి ఆ బంగారం మీ దగ్గర ఉంటే దానిపై ‘షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్' కట్టాలి. ఒకవేళ మూడేళ్లకంటే ఎక్కువ కాలం నుంచి ఆ బంగారం మీ దగ్గర ఉంటే దానిపై ‘లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్' కింద 20 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు బంగారాన్ని విక్రయించినప్పుడు కూడా మీకు మూలధన లాభం వచ్చిందా? లేక నష్టం వచ్చిందా? అనే విషయం ఆ విక్రయానికి సంబంధించిన రశీదు ఉంటేనే ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌కు అర్థమవుతుంది.

రశీదులు దాచుకుంటేనే మంచిది...

రశీదులు దాచుకుంటేనే మంచిది...

కాబట్టి మీరు బంగారం కొన్నా లేదా అమ్మినా ఆ లావాదేవీలకు సంబంధించిన రశీదులు జాగ్రత్తగా దాచుకోవడం శ్రేయస్కరం. ఎందుకంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ చేసే సమయంలో ఎక్కడ నుంచి, ఎంత మొత్తంలో మీరు బంగారం కొన్నారో చూపించడానికి ఈ రశీదులే ఆధారం. అలాగే ట్యాక్స్ స్క్రూటినీ సమయంలో కూడా ఈ రశీదులు ఉపయోగపడతాయి. అంతేకాదు, సదరు బంగారం కొనడానికి డబ్బు ఎక్కడ్నించి వచ్చిందో కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కాబట్టి గతంలో మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా.. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన తరువాత వాటికి సంబంధించిన రశీదులు దాచిపెట్టుకోవడమే అన్ని విధాలా మంచిది.

English summary

బంగారం కొంటున్నారా.. రశీదులు జాగ్రత్త! ఐటీ రిటర్నులకు అవే ఆధారం! | keep gold receipts safe for income tax purpose

Gold purchases are generally high-value transactions and it makes sense to save the receipts. It can also help you show the source of gold in cases where you need to show your holding in your income tax return or if there’s a tax scrutiny.
Story first published: Monday, December 2, 2019, 18:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X